ETV Bharat / bharat

'ఖాతాల నిలిపివేతపై ట్విట్టర్​ వివరణ ఇవ్వాలి'

author img

By

Published : Jun 29, 2021, 7:56 PM IST

Updated : Jun 29, 2021, 10:55 PM IST

కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్​ ఖాతాల నిలిపివేతపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ట్విట్టర్​ను ఆదేశించింది పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ. దాంతో పాటే భారత్​ పటాన్ని వక్రీకరించినందుకు ట్విట్టర్​పై రెండు కేసులు నమోదయ్యాయి.

Twitter
ట్విట్టర్

కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​ ఖాతాలను ట్విట్టర్​ ఏ ప్రాతిపదికన నిలిపివేసిందో చెప్పాలని ఆదేశించింది ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ఈ మేరకు ట్విట్టర్​ నుంచి రెండు రోజుల్లో లిఖితపూర్వక సమాధానం రాబట్టాలని కమిటీకి నేతృత్వం వహిస్తున్న థరూర్​.. సెక్రటేరియట్​కు సూచించారు.

చుట్టుముడుతున్న చిక్కులు

ఐటీ నిబంధనల విషయంలో కేంద్రంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. రోజురోజుకు చిక్కుల ఊబిలో పడుతోంది ట్విట్టర్. ఇటీవలే భారతదేశ పటాన్ని వక్రీకరించి ప్రదర్శించింది. తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా కొద్ది గంటల్లోనే ఆ మ్యాప్​ను తొలగించింది. ఈ వ్యవహారంపై మంగళవారం ఒక్కరోజే ఆ సంస్థపై రెండు కేసులు నమోదయ్యాయి. సంస్థ భారత కార్యాలయ సీనియర్ అధికారులపై ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​లలో ఎఫ్​ఐఆర్​లు దాఖలయ్యాయి.

ఇక బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని అనుమతించడం, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోనందున జాతీయ బాలల హక్కుల కమిషన్​ ఫిర్యాదు మేరకు ట్విట్టర్​పై కేసు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

మరోవైపు, ముస్లిం వృద్ధుడిపై దాడి వ్యవహారంలో ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిపై చర్యలు తీసుకోరాదని కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు యూపీ పోలీసులు.

ఇవీ చూడండి:

ట్విట్టర్ వరుస వివాదాలు- పొరపాట్లా? కవ్వింపులా?

గూగుల్​, ఫేస్​బుక్​కు థరూర్​ కమిటీ హెచ్చరిక!

Last Updated : Jun 29, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.