ETV Bharat / bharat

Parliament winter session: పట్టువీడని విపక్షాలు- ఉభయసభలు రేపటికి వాయిదా

author img

By

Published : Dec 1, 2021, 10:26 AM IST

Updated : Dec 1, 2021, 7:51 PM IST

parliament winter session
పార్లమెంట్​ లైవ్​

19:46 December 01

లోక్​సభ గురువారానికి వాయిదా

మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన లోక్​సభ కార్యకలాపాలు రాత్రి 7.30 వరకు సజావుగా సాగియి. ఈ క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. పలు అంశాలపై చర్చించిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.

15:08 December 01

రాజ్యసభ రేపటికి వాయిదా..

12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్​పై విపక్షాలు పట్టువీడకపోవడంతో.. సభ రేపటికి వాయిదా పడింది.

లోక్​సభలో యథావిధిగా కార్యకలాపాలు సాగుతున్నాయి.

14:14 December 01

సభలు వాయిదా..

కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​.. విపక్షాల ఆందోళనల నడుమ డ్యామ్​ సేఫ్టీ బిల్లు, 2019ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వారు పట్టువీడకపోవడంతో.. సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది.

అంతకుముందు లోక్​సభ 2.35కు వాయిదా పడింది.

13:45 December 01

సాయం ఎలా చేస్తాం..

గత ఏడాది కాలంలో వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా సంభవించిన రైతుల మరణాలపై తమ వద్ద సమాచారం లేదని కేంద్రం వెల్లడించింది. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సమాచారమే లేనప్పుడు సాయం అనేది ఎలా ఉంటుందని అన్నారు.

13:36 December 01

లోక్​సభ వాయిదా..

లోక్​సభలో కార్యకలాపాలు యథావిధిగా సాగాయి. అనంతరం.. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

12:04 December 01

ఎగువ సభ వాయిదా..

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభ కార్యకలాపాలకు మరోసారి ఆటంకం కలిగింది. విపక్షాల ఆందోళనల నడుమ సభను.. 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

12 మంది ఎంపీల సస్పెన్షన్​ అంశాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేవనెత్తిన నేపథ్యంలో.. సభ వాయిదా పడింది.

11:29 December 01

లోక్​సభ వాయిదా..

విపక్షాల ఆందోళనల నడుమ లోక్​సభ కూడా 12 గంటలకు వాయిదా పడింది. ఈ మేరకు స్పీకర్​ ఓం బిర్లా ప్రకటించారు.

11:19 December 01

కాంగ్రెస్​ వాకౌట్​..

లోక్​సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. కాంగ్రెస్​, డీఎంకే సభ్యులు వాకౌట్​ చేశారు.

11:13 December 01

రాజ్యసభ వాయిదా..

విపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది.

11:11 December 01

ఎంపీల నిరసన..

సస్పెన్షన్​కు గురైన 12 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఎదుట నిరసనలకు దిగారు. తమపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్లకార్డులు పట్టుకున్నారు.

10:08 December 01

parliament winter session: గాంధీ విగ్రహం ముందు విపక్షాల నిరసన

  • Opposition leaders protest at Mahatma Gandhi statue in Parliament premises demanding revocation of suspension of 12 Opposition MPs of Rajya Sabha pic.twitter.com/v9IVEGjzby

    — ANI (@ANI) December 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

parliament winter session live

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు నేడు మూడో రోజు. 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలని రెండు రోజులుగా నిరసనలు చేశాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో సభా వాయిదాల పర్వం కొనసాగింది.

మూడో రోజు (బుధవారం) కూడా పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనలకు దిగాయి కాంగ్రెస్​ సహా ఇతర విపక్షాలు. సస్పెన్షన్​ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. అయితే.. ఇవాళ రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

rajyasabha opposition leader

ఈ మేరకు ఎగువసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్​ ఖర్గే నేతృత్వంలో.. విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. సభలో ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించనున్నారు.

mps suspended from parliament

పార్లమెంట్​ వేసవికాల సమావేశాల్లో సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు 12మంది రాజ్యసభ సభ్యులపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. వీరిని మొత్తం శీతాకాల సమావేశాలకు హాజరుకాకుండా ఛైర్మన్ నిషేధం విధించారు. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాము ఏ తప్పూ చేయలేదని, సభా నియమాలకు విరద్దంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారని ఆరోపించాయి.

Last Updated :Dec 1, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.