ETV Bharat / bharat

పొరపాటున పాక్​లోకి BSF జవాన్​.. 30 గంటలు బందీ.. చివరకు..

author img

By

Published : Dec 8, 2022, 7:30 PM IST

Updated : Dec 8, 2022, 7:40 PM IST

అనుకోకుండా పాకిస్థాన్​లోకి ప్రవేశించిన బీఎస్​ఎఫ్ జవాన్​ను ఆ దేశ రేంజర్లు సుమారు 30 గంటల పాటు బందీగా ఉంచారు. అనంతరం అతడిని భారత్​కు అప్పగించారు. అసలేం జరిగిందంటే?

Pak releases BSF jawan after over 30 hours in captivity
Pak releases BSF jawan after over 30 hours in captivity

భారత-పాకిస్థాన్​లో విధులు నిర్వర్తిస్తున్న ఓ బీఎస్ఎఫ్​ జవాన్​.. అనుకోకుండా దాయాది దేశంలోకి ప్రవేశించాడు. వెంటనే అతడిని ఆ దేశ రేంజర్లు బంధించారు. సుమారు 30 గంటల తర్వాత తిరిగి అతడిని అప్పగించారు.
అధికారుల వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఓ బీఎస్​ఎఫ్​ జవాన్.. అనుకోకుండా పాకిస్థాన్​ అబోహర్​ సెక్టార్​లోకి ప్రవేశించాడు. అనంతరం అతడిని పాక్​ జవాన్లు సుమారు 30 గంటలకుపైగా నిర్బంధించారు. గురువారం సాయంత్రం 17.10 గంటలకు ఫ్లాగ్​ మీటింగ్​ జరిగిన సమయంలో తిరిగి అతడిని సురక్షితంగా అప్పజెప్పారు.

కొద్దిరోజుల క్రితం అబోహర్​ సెక్టార్​లోని ఇలాంటి ఘటనే జరిగింది. డిసెంబర్​ 1న జీరో లైన్ చెకింగ్ చేస్తుండగా ఓ జవాన్ పాకిస్థాన్​ భూభాగంలోకి వెళ్లాడు. ఫ్లాగ్ మీటింగ్ తర్వాత అదే రోజు పాకిస్థాన్​ రేంజర్లు అతడ్ని తిరిగి అప్పగించారు.

Last Updated : Dec 8, 2022, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.