'గత జన్మ గుర్తొచ్చింది.. లీవ్ ఇస్తే ఆ పని చేస్తా'.. బాస్​కు సబ్​ ఇంజినీర్​ లేఖ

author img

By

Published : Oct 11, 2021, 2:05 PM IST

sub engineer leave letter

ప్రతి ఆదివారం సెలవు కావాలని కోరుతూ ఓ ప్రభుత్వ ఉద్యోగి తన పైఅధికారులకు రాసిన లేఖ(Sunday Leave Application).. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తనకు గత జన్మ గురించి తెలిసిందని.. ఇప్పుడు జీవిత రహస్యాన్ని కనుగొనాలనుకుంటున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ తన గత జన్మలో నకులుడు అని, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్​ శకుని అని చెప్పారు.

మధ్యప్రదేశ్​లో ఓ సబ్ ఇంజినీర్​ వింత కారణాలతో ప్రతి ఆదివారం(Sunday Leave Application) 'డే ఆఫ్​' కావాలని తన పైఅధికారులను అభ్యర్థించారు. ఆ దరఖాస్తులో(Sunday Leave Application) ఆయన పేర్కొన్న అంశాలను చూడగా విస్తుపోవడం వారి వంతైంది. అసలేం జరిగిందంటే..?

గత జన్మ గుర్తొచ్చి...

అగర్​ మాల్వా జిల్లాలోని(Agar Malwa News) సంశేర్​ జనపద్​ పంచాయతీ చీఫ్​కు.. సబ్ ఇంజినీర్ రాజ్​కుమార్ యాదవ్ ఈ లేఖ రాశారు. అందులో తనకు కొద్దిరోజుల క్రితమే గత జన్మ గురించి తెలిసిందని చెప్పారు. తన జీవిత రహస్యాన్ని కనుగొనడానికి, ఆత్మను శోధించేందుకు ఉపయోగపడేలా ప్రతి ఆదివారం తనకు 'డే ఆఫ్'​ ఇవ్వాలని కోరారు.

sub engineer leave letter
రాజ్​ కుమార్​ యాదవ్ రాసిన లేఖ

"నా గత జన్మలో ప్రస్తుత ఏఐఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్ ఒవైసీ.. పాండవుల్లో ఒకరైన నకులుడు. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. అదే సమయంలో ప్రస్తుతం ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్​ శకుని. నా గత జన్మ గురించి తెలిశాక.. ఇకపై నేను నా జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. శాశ్వతమైన ఆత్మ కోసం శోధించాలనుకుంటున్నాను. "

-రాజ్​కుమార్ యాదవ్​, సబ్ ఇంజినీర్​

​"నేను భగవద్గీత బోధించిన మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నాను. నాలో ఉన్న అహాన్ని తొలగించుకోవడానికి ప్రతి ఆదివారం భిక్షాటన చేయాలనుకుంటున్నాను. ప్రతి ఇంటి నుంచి గోధుమలను యాచించాలనుకుంటున్నాను. దానికోసమే నాకు ఆదివారం డే ఆఫ్ కావాలి" అని రాజ్​కుమార్ యాదవ్​ తన దరఖాస్తులో పేర్కొన్నారు.

కల ద్వారా తెలిసింది..

తాను ఈ లేఖ రాసింది నిజమేనని విలేకర్లతో రాజ్​కుమార్ యాదవ్ ఆదివారం తెలిపారు. ఇటీవల తనకు వచ్చిన కల ద్వారా గత జన్మ జ్ఞాపకాలు తెలిశాయని చెప్పారు. "ఆదివారం సెలవు రోజైనా మమ్మల్ని తరచూ డ్యూటీకి హాజరు కావాలని పిలుస్తారు . కానీ ఆ రోజు నేను ఆత్మశోధన చేయాలనుకుంటున్నాను. అందుకే ఆదివారం నాకు సెలవు కావాలని కోరుతూ లేఖ రాశాను" అని చెప్పారు రాజ్​కుమార్ యాదవ్​.

రాజ్​కుమార్ రాసిన ఈ లేఖ.. సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవీ చూడండి:

భర్త కట్టించిన దుర్గమ్మ గుడిలో ముస్లిం మహిళ పూజలు

Rape: నమ్మి వెంట వెళ్లిన యువకుడిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.