covid variant: 'దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర వేరియంట్లు'

author img

By

Published : Aug 30, 2021, 8:33 PM IST

covid variant

దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర కొవిడ్ 19 వేరియంట్లు (variant of concern) ఉన్నట్లు గుర్తించింది జీనోమ్​ కన్సార్టియం. ఇక భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా డెల్టా రకం కరోనా.. ప్రధాన ఆందోళనకర వేరియంట్​గా పరిణమించిందని తెలిపింది.

కరోనా మూడో దశ ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో 31,124 ఆందోళనకర కరోనా వేరియంట్లను (variant of concern) గుర్తించింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీనోమ్​ కన్సార్టియం(ఐఎన్​ఎస్​ఏసీఓజీ-ఇన్సాకాగ్).

దేశవ్యాప్తంగా జరిపిన జీనోమ్​ సీక్వెన్సింగ్​లో వీటిని గుర్తించారు. ఇందులో 4,227 ఆల్ఫా, 219 బీటా, 2 గామా, 21,192 డెల్టా, 5,417 బి.1.1617.1, బి.1.617.3 వేరియంట్లున్నాయి.

ప్రస్తుతానికి భారత్​లో డెల్టానే ప్రధాన ఆందోళనకర వేరియంట్​గా ఉందని నిపుణులు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న ఏవై.12 కేసులకు డెల్టాతో మాలిక్యులర్​ స్థాయిలో దగ్గరి సంబంధం కనిపిస్తోందని చెప్పారు. అయిత్ వాటి ప్రభావంలో తేడాలను అంచనా వేయాల్సి ఉందని ఓ సీనియర్​ అధికారి పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా డెల్టానే..

ప్రపంచవ్యాప్తంగా డెల్టా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్​లో 60శాతానికి పైగా టీకా వేసినప్పటికీ గతంలో కన్నా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చైనా, కొరియాల్లోనూ డెల్టా ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది.

ఇదీ చూడండి: Corona Virus: ఏడాది దాటినా వీడని కరోనా సమస్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.