ETV Bharat / bharat

Online Business Investment Cheating in AP : రూ.2వేల కోట్ల కుచ్చుటోపీ.. అధిక వడ్డీ, లాభాల్లో వాటా పేరిట ఎర

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 3:37 PM IST

Online_Business_Investment_Cheating_in_AP
Online_Business_Investment_Cheating_in_AP

Online Business Investment Cheating in AP: ఆన్‌లైన్‌లో వినియోగ వస్తువుల షాపింగ్‌ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. కొన్నాళ్లు సజావుగా నిర్వహించారు. ఈ ముసుగులో పెద్ద ఎత్తున దొరికిన చోట దొరికిన కాడికి అప్పులు చేశారు. 10 రూపాయల వడ్డీ ఇస్తామని ఆశ చూపించి వందల కోట్లలో డబ్బులు తీసుకున్నారు. ఎన్టీఆర్‌, గుంటూరు, గోదావరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తున వసూలు చేశారు. వాటితో భారీగా ఆస్తులు పోగేసుకుని, విచ్చలవిడి ఖర్చులతో విలాసవంతమైన జీవితం గడిపారు. చివరకు డబ్బులు చెల్లించలేక చేతులెత్తేశారు. 2వేల కోట్ల విలువ చేసే ఈ మోసానికి బలైన బాధితులు లబోదిబోమంటున్నారు.

Online Business Investment Cheating in AP: ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలానికి చెందిన దంపతులు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజుతో కలిసి మూడేళ్ల క్రితం ఓ కంపెనీని స్థాపించారు. భర్త ఎండీగా, అతని భార్య డైరెక్టర్‌గా పేరు నమోదు చేయించారు. ఆన్‌లైన్‌లో వినియోగ వస్తువులను హోల్‌సేల్‌ ధరలకే డెలివరీ చేసేందుకు ఈ కంపెనీని ఏర్పాటు చేశారు.

Dwakra Groups Animators Fraud: మహిళా పొదుపు సంఘాల పేరుతో ఘరానామోసం.. సభ్యులకు తెలియకుండా రూ. కోటి వరకు లోన్స్

ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల, తెలంగాణలోని హైదరాబాద్‌లో గోదాములను అద్దెకు తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారం పేరుతో భారీగా అప్పులు చేయడం ప్రారంభించారు. తనకు నగదు ఇచ్చిన వారికి 10 రూపాయల వడ్డీతో పాటు లాభాల్లో వాటా ఇస్తానని నమ్మించారు. ఇది నిజమే అని నమ్మి పెద్ద సంఖ్యలో లక్షల నుంచి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా దుగ్గిరాలపాడు సమీపంలోని గూడెం మాధవరానికి ఓ వ్యక్తి రూ.10 కోట్లు మేర పెట్టుబడులు పెట్టాడు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన మరో వ్యక్తితో రూ. 45 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టించినట్లు సమాచారం. ఇలా పలువురు రూ. 50 లక్షల నుంచి రూ. 80 కోట్ల వరకూ ఇచ్చినట్లు తెలిసింది.

Fraud: మోసానికి ఏదీ కాదు అనర్హం.. సిగరెట్ల వ్యాపారం పేరుతో కోట్లకు టోకరా.. !

పరిటాలలో ఓ మహిళ తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిని ఈ దంపతులకే విక్రయించి, ఆ సొమ్ము రూ. 2కోట్లను తిరిగి పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో రూ. 100 కోట్లు, కవులూరులో రూ. 80 లక్షలు, కంచికచర్లలోని ఓ అపార్ట్‌మెంట్‌ వాసులు రూ.10కోట్లు ఇచ్చినట్లు సమాచారం. విజయవాడ, హైదరాబాద్‌, ఇబ్రహీంపట్నం, మైలవరం తదితర ప్రాంతాలకు చెందిన పలువురు భారీగా నగదు ముట్టజెప్పినట్లు తెలిసింది.

APP Cheating మాకో యాప్ ఉంది.. దానికో స్కీం ఉంది! విజయవాడ కేంద్రంగా మరో ఆన్​లైన్ దగా!

ప్రతి నెలా వడ్డీ రావడంతో కొందరు ఆ వడ్డీ రూపంలో వచ్చిన మొత్తాన్ని తిరిగి కంపెనీలోనే పెట్టుబడి పెట్టేశారు. కంపెనీలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు నోట్లు, చెక్కులు హామీగా అడగ్గా.. అలా అయితే మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, నమ్మకం ఉంటేనే నగదు ఇవ్వండని నమ్మబలికారు. విజయవాడకు చెందిన ఇతని బంధువు క్రషర్‌ యజమాని రూ. 50కోట్ల వరకు సమకూర్చినట్లు తెలుస్తోంది. మరో స్నేహితుడితో రూ. 70కోట్లు కూడా ఇప్పించారని.. అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా డబ్బులు సేకరించినట్లు చెబుతున్నారు.

2000 Notes Exchange Fraud: నోట్ల మార్పిడి మోసం.. 80 లక్షలతో ముఠా ఉడాయింపు..!

Couple Cheating with Online Business Investment: ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేత ఒకరు ఈ కంపెనీలో రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. మోసం సంగతి బయటకు రావడంతో ఆ నాయకుడి అనుచరులు హైదరాబాద్‌లోని రాంబాబు ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. వారు అతని నుంచి 5కిలోల బంగారం, కొంత నగదు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కంపెనీలో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారిని మలేషియా, బ్యాంకాక్‌, ఇతర దేశాలకు తీసుకువెళ్లి విందులు, వినోదాలు ఇప్పించారు.

బిచాణా ఎత్తేసేందుకు నిర్ణయించుకున్న తర్వాత.. ప్రణాళిక ప్రకారం వ్యాపారాన్ని తగ్గించడం ప్రారంభించారు. గోదాముల్లో సరకును తగ్గించారు. గోదాములో స్టాకు లేకపోయినా వ్యాపారం చేస్తున్నట్లు అందరినీ నమ్మించాడు. అప్పటి నుంచి ఇంకా విచ్చలవిడిగా అప్పులు చేశాడు. పెద్ద ఎత్తున చేసిన అప్పులతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విల్లాలు, విలువైన స్థలాలు కొనుగోలు చేశాడు. భారీగా ఆస్తులు కూడబెట్టారు.

Exchange notes Fraud: రూ.10 లక్షలకు ఆశపడి.. రూ.90 లక్షలు పోగొట్టుకున్నారు

నాలుగు రోజుల క్రితం కొందరు బాధితులు కంచికచర్ల మండలం పరిటాలలోని రాంబాబు ఇంటికి వచ్చి డబ్బుల విషయమై గట్టిగా నిలదీసి కొట్టినట్లు తెలిసింది. డబ్బులు సర్దుబాటు చేస్తానని వారిని మభ్యపెట్టాడు. తనకేం సంబంధం లేదని.. తన భాగస్వామే ఇదంతా చేశాడని నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తర్వాత పరిటాల నుంచి హైదరాబాద్‌కు చేరాడు. విషయం బయటకు పొక్కడంతో కంచికచర్లలో గోదాము యజమాని వచ్చి తాళం వేసుకుని వెళ్లాడు. రాంబాబు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసుకుని, అక్కడి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

'మాయా అద్దం'.. మోసపోయిన 72 ఏళ్ల వృద్ధుడు.. వారిని నగ్నంగా చూడొచ్చని రూ.9 లక్షలు వసూలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.