ETV Bharat / state

Dwakra Groups Animators Fraud: మహిళా పొదుపు సంఘాల పేరుతో ఘరానామోసం.. సభ్యులకు తెలియకుండా రూ. కోటి వరకు లోన్స్

author img

By

Published : Aug 9, 2023, 10:34 AM IST

Fraud
Fraud

Dwakra Groups Animators Fraud: మహిళా పొదుపు సంఘాల పేరుతో.. సభ్యులకు తెలియకుండానే లోన్స్ తీసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బ్యాంకుల్లో మోసపూరితంగా తీసుకున్న రుణాలు మొత్తం చెల్లించాలని, లేకపోతే పోరాటం తీవ్రం చేస్తామని మహిళా సభ్యులు హెచ్చరించారు.

మహిళా పొదుపు సంఘాల పేరుతో యానిమేటర్ల ఘరానామోసం

Dwakra Groups Animators Fraud: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో స్వయం సహాయక సంఘాల గ్రూపుల పేరుతో.. యానిమేటర్లు బ్యాంకులలో మోసపూరితంగా రుణాలు తీసుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో 60కు పైగా స్వయం సహాయక సంఘాల గ్రూపులను పర్యవేక్షించే ఇద్దరు యానిమేటర్లు.. ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. గ్రూపులు రుణాలు పొందిన బ్యాంకుల్లో కాకుండా.. ఇతర బ్యాంకుల్లో డాక్యుమెంట్లు పెట్టి గ్రూపు సభ్యులకు తెలియకుండా కోటి రూపాయల వరకు మోసపూరితంగా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. గ్రామంలోని ఓ గ్రూపునకు అప్పు చెల్లించాలని బ్యాంకు సందేశం పంపడంతో యానిమేటర్ల నిర్వాకం బయటపడింది. దీంతో గ్రూపుల సభ్యులు అధికారులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

YCP Leader Fraud in the Name of Job: మోసపోయాం.. ఆత్మహత్యకు అనుమతివ్వండి.. స్పందనలో బాధితుడి విజ్ఞప్తి

వివరాల్లోకి వెళ్తే.. హేమంత్ మహిళా గ్రూపు.. రుణం తీసుకోకపోయినా చిలకలూరిపేట జీడీసీసీ బ్యాంకు నుంచి సదరు గ్రూప్ సభ్యులకు తీసుకున్న రుణం తాలూకు అప్పు చెల్లించాలని మొబైల్ ఫోన్లకు మెసేజ్ వచ్చింది. అయితే తాము జీడీసీసీ బ్యాంకులో రుణం తీసుకోకపోయినా.. అప్పు చెల్లించమని ఎలా మెసేజ్ పెడతారంటూ బ్యాంకు అధికారులను గ్రూప్ సభ్యులు నిలదీశారు. దీంతో యానిమేటర్లు చేసిన నిర్వాహకం బయటపడింది. విషయం గ్రామంలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళా సభ్యులకు తెలియడంతో 60 గ్రూపులకు చెందిన మహిళా సభ్యులు అందరూ మంగళవారం రాత్రి యడ్లపాడు మండలం ఏపియం జగజ్జివన్ రావు, బ్యాంక్ అధికారులను గ్రామానికి పిలిపించారు.

cheating woman in Nandyal :అందరితో సన్నిహితంగా ఉంటూ.. రూ.5వడ్డీ అంటూ.. ఆ మహిళ ఏం చేసిందంటే..!

జరిగిన మోసాన్ని నిగ్గు తేల్చాలని మహిళలు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో సమావేశం వద్దకు యానిమేటర్లను పిలిపించాలని డిమాండ్ చేశారు. దీంతో యానిమేటర్లు ఇద్దరినీ అక్కడకు రప్పించారు. గ్రూప్ సభ్యులకు తెలియకుండా తీసుకున్న రుణాలు మొత్తం చెల్లించాలని మహిళలందరూ ముక్తకంఠంగా నినదించారు. శుక్రవారం లోపు అన్ని బ్యాంకుల్లో మోసపూరితంగా తీసుకున్న రుణాలు మొత్తం చెల్లించాలని, లేకపోతే పోరాటం తీవ్రం చేస్తామని పొదుపు సంఘం మహిళా సభ్యులు హెచ్చరించారు. దీనిపై ఏపీఎం మాట్లాడుతూ.. యానిమేటర్లు మోసపూరితంగా రుణాలు తీసుకున్న మాట వాస్తవమేనని అన్నారు. ఎన్ని బ్యాంకుల్లో ఇలా తీసుకున్నారో విచారించి చర్యలు తీసుకుంటామని మహిళా సభ్యులకు తెలిపారు.

Jagan cheated students నయవంచనగా విదేశీ విద్యా దీవెన.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసిన జగన్

మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో బ్యాంక్ ఉద్యోగిని అంటూ మాయ మాటలు చెప్పి డ్వాక్రా మహిళకు అపరిచిత వ్యక్తి టోకరా వేశాడు. నగదును బ్యాంకులో జమ చేసేందుకు ఆమె క్యూలో నించున్న సమయంలో ఓ అపరిచిన వ్యక్తి వచ్చి తాను బ్యాంకు ఉద్యోగిని అని నమ్మించి డబ్బులు కడతానని చెప్పి ఆమె వద్ద నగదు తీసుకున్నాడు. దీనిపై మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.