'విశాఖ నుంచి అమెజాన్​ ద్వారా 1000కిలోల గంజాయి స్మగ్లింగ్​'

author img

By

Published : Nov 15, 2021, 6:58 PM IST

Updated : Nov 15, 2021, 7:43 PM IST

one-ton-of-ganja-was-smuggled-through-e-commerce-company-smuggling-was-done-by-tagging-kadi-patta

విశాఖపట్నం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు అమెజాన్ ద్వారా 1000కిలోల గంజాయి అక్రమ రవాణా జరిగిందని మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా ఎస్పీ వెల్లడించారు(ganja smuggling news). గుజరాత్​కు చెందిన ఓ కంపెనీ వస్త్ర పరిశ్రమ ముసుగులో ఈ దందా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తునట్లు చెప్పారు(ganja smuggling in india).

గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి(ganja smuggling news) మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్​ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు అమెజాన్ ​ ద్వారా గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. శనివారం 20 కేజీల పార్సిల్​ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు(ganja smuggling in india). దీనిపై కరివేపాకు అని రాసి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి కల్లు అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా.. గంజాయి రాకెట్ గుట్టు రట్టయిందన్నారు. అతడు రూ.1.1కోట్ల లావాదేవీలు జరిపినట్లు తెలిసిందని వెల్లడించారు. గోవింద్ దాబాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాబా నిర్వాహకుడిని కూడా అరెస్టు చేశారు. అతడే గంజాయి పార్సిళ్లను రిసీవ్ చేసుకునే వాడని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్​లోనూ ముకేశ్ జైశ్వాల్​ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు(ganja smuggling visakhapatnam).

'విశాఖ నుంచి అమెజాన్​ ద్వారా 1000కిలోల గంజాయి స్మగ్లింగ్​'

గత నాలుగు నెలల్లో అమెజాన్ ద్వారా టన్ను గంజాయిని స్మగ్లింగ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో కల్లు వెల్లడించాడు. అమెజాన్ ప్రతి డెలవరీకి​ 67శాతం డబ్బును కమీషన్​గా తీసుకుందని చెప్పాడు. బాబు టెక్స్ కంపెనీ పేరుతో గుజరాత్​ సూరత్​లో రిజిస్టర్​ అయిన ఓ వస్త్ర సంస్థ హెర్బల్ ఉత్పత్తులతో పాటు గంజాయిని విక్రయిస్తోంది. అమెజాన్ ఈ విషయంపై ఎందుకు విచారణ జరపలేదు?. దీనిపై మరింత సమాచారం కావాలని అమెజాన్​ను కోరాం. ఒకవేళ ఈ ఈ-కామర్స్ కంపెనీకి సంబంధాలున్నట్లు తెలిస్తే సంస్థపై తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​కు తెలియజేస్తాం.

-మనోజ్ కుమార్ సింగ్​, భిండ్ ఎస్పీ

అమెజాన్ స్పందన..

గంజాయికి వనరుగా తమ ప్లాట్​ఫామ్​ను దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు అమెజాన్ తెలిపింది(amazon news). దీనిపై తమకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పింది. అధికారులు, ఈడీకి దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది.

సెయిట్ అందోళన..

గంజాయి రాకెట్ తీవ్ర నేరమని(ganja smuggling), మధ్యప్రదేశ్ పోలీసులతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కూడా దీనిపై సీరియస్‌గా వ్యవహరించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(CAIT) పేర్కొంది. ఈ అంశాన్ని తేలిగ్గా వదిలేయవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​ను కోరింది. ఇదే తరహాలో ఆయుధాల ఆక్రమ రవాణ జరిగితే దేశ భద్రతకే ముప్పు అని హెచ్చరించింది.

ఇదీ చదవండి: 'క్రిప్టోకరెన్సీని ఆపలేం.. చట్టబద్ధం చేస్తే బెటర్!'

Last Updated :Nov 15, 2021, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.