ETV Bharat / bharat

India Omicron News: 'సిద్ధంగా ఉండండి'.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

author img

By

Published : Nov 28, 2021, 2:54 PM IST

Updated : Nov 28, 2021, 6:08 PM IST

Omicron India: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ఈ విషయంపై ఆయా ప్రభుత్వాలకు లేఖ రాశారు.

omicron india news , ఒమిక్రాన్​
ఒమిక్రాన్​ ఇండియా

Omicron India News: దేశానికి కరోనా కొత్త వేరియంట్​ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్​​ నియంత్రణ కోసం విస్త్రతంగా సన్నద్ధమవ్వాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను పెంచాలని స్పష్టం చేసింది.

వైరస్​ కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ.. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు శనివారం లేఖ రాశారు. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టాలని, కొవిడ్​ నమూనాలను వేగంగా ల్యాబ్​లకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వైరస్​ కట్టడికి ప్రజలు.. నిబంధనలు పాటించే విధంగా చూసుకోవాలని స్పష్టం చేశారు.

ఒమిక్రాన్​ కేసులు బయటపడిన దేశాలను ముప్పు ప్రాంతాలుగా గుర్తించామని, అక్కడి నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై మరిన్ని నిబంధనలు విధించే అవకాశముందని లేఖలో భూషణ్​ పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల సంఖ్య తగ్గిపోయిందని, కొత్త వేరియంట్​ను గుర్తించేందుకు టెస్టింగ్​ను ఉద్ధృతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

'ఫ్లైట్లు నిలిపివేయండి...'

ఒమిక్రాన్​పై సర్వత్రా భయాందోళనలు నెలకొన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ లేఖ రాశారు. ఒమిక్రాన్​ ప్రభావిత దేశాల నుంచి వచ్చే విమానాలను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు(omicron india).

"ఏడాదిన్నర కాలంగా.. మనం దేశంలో కరోనాపై కఠినమైన పోరాటం జరుగుతూనే ఉంది. ఇక కొత్త వేరియంట్​ను దేశంలోకి రానివ్వకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మనం అన్ని విధాలుగా కృషి చేయాలి. ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే విమానాలను ఐరోపా సహా అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. మనం కూడా అదే పని చేయాలి. ఆలస్యం చేస్తే.. భారత్​ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది."

--- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ సీఎం.

దక్షిణాఫ్రికా, హాంగ్​కాంగ్​, బోట్స్​వానా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాలని కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై.. కేంద్రాన్ని అభ్యర్థించారు.

"విదేశాల్లో కొత్త వేరియంట్​ బయటపడింది. దక్షిణాఫ్రికా, హాంగ్​కాంగ్​, బోట్స్​వానాలో ఈ వేరియంట్​ కనిపించింది. దీనిపై డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరికలు జారీ చేసింది. ఐరోపా దేశాలు ఆయా ప్రాంతాల పర్యటకులపై నిషేధాన్ని కూడా విధించాయి. వాటిపై నిషేధం విధించాలని మేము కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశాము."

--- బసవరాజ్​ బొమ్మై, కర్ణాటక సీఎం.

ఇవీ చూడండి:-

Last Updated :Nov 28, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.