ETV Bharat / bharat

గేదెను ఢీకొట్టిన ప్యాసెంజర్ రైలు- పట్టాలు తప్పిన బోగీ

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 10:36 PM IST

Updated : Nov 8, 2023, 11:04 PM IST

odisha train derailed
odisha train derailed

Odisha Train Derailed : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఝార్సుగూడ - సంబల్​పుర్​ మెము ప్యాసింజర్ పట్టాలపై ఉన్న గేదెను ఢీకొట్టింది. దీంతో ఓ రైలు బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.

Odisha Train Derailed : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఝార్సుగూడ నుంచి సంబల్​పుర్ వెళ్తున్న​ మెము ప్యాసింజర్ రైలు పట్టాలపై ఉన్న గేదెను ఢీకొట్టింది. దీంతో ఓ రైలు బోగీ పట్టాలు తప్పింది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.

మరోవైపు డీఆర్​ఎమ్​ ప్రమాద స్థలానికి చేరుకుని ట్రాక్​ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం ట్రాక్​ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో రైళ్ల రాకపోకలకు అనుమతిచ్చారు.

  • VIDEO | A MEMU passenger train derailed reportedly after hitting a cow near Sarala in Odisha's Sambalpur district. More details are awaited. pic.twitter.com/CvZdxY3KIj

    — Press Trust of India (@PTI_News) November 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పట్టాలు తప్పిన రైలు..
కొద్ది రోజుల క్రితం ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ రైల్వే స్టేషన్​ సమీపంలో సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఘాజీపుర్​ నుంచి దిల్లీలోని ఆనంద్​ విహార్ టెర్మినల్​​కు వెళ్తున్న సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్​ సహా మరో రెండు కోచ్​లు పట్టాలు తప్పాయి.

త్రుటిలో తప్పిన ఈ పెను ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తామని ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. రైల్వే ట్రాక్​ పునరుద్ధరణ పనులు చేపట్టామని.. మిగతా రైళ్ల రాకపోకలు​ సాధారణంగానే జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గ్రీన్ సిగ్నల్​ ఇచ్చిన వెంటనే రైలు ప్రయాగ్​రాజ్​ స్టేషన్​ నుంచి బయలుదేరిందని.. ఆ సమయంలోనే ప్లాట్​పామ్​ నెంబర్​ 6 వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు.

Bihar Train Accident : కొన్నాళ్ల క్రితం బిహార్​లోని బక్సర్​ జిల్లాలో నార్త్​ఈస్ట్​​ సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​(రైలు నెం-12506) పట్టాలు తప్పింది. రఘనాథ్​పుర్​ రైల్వే స్టేషన్​లో సమీపంలో రాత్రి 9.53 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 70 మందికి గాయాలయ్యాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated :Nov 8, 2023, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.