ETV Bharat / bharat

బైక్​పై హెల్మెట్​ లేకుండా ఎమ్మెల్యే, మంత్రి.. రూ.1,000 ఫైన్ వేసిన ట్రాఫిక్​ పోలీస్​

author img

By

Published : Jun 25, 2022, 5:06 PM IST

'చట్టం ముందు అందరూ సమానులే' అనే నానునిడి నిజం చేశారు ఒడిశాలోని బాలేశ్వర్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా విధించారు.

Odisha Minister
ఒడిశా విద్యాశాఖ మంత్రికి జరిమానా​

ఒడిశాలోని బాలేశ్వర్​ ట్రాఫిక్​ పోలీసులు తీరుపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. హెల్మెట్​ లేకుండా బాలేశ్వర్ శాసనసభ్యుడు స్వరూప్ దాస్​ బైక్​ను నడిపారు. ఆయనతో పాటు బైక్​పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఉన్నారు. హెల్మెట్​ లేకుండా బైక్​ నడిపినందుకుగానూ ఎమ్మెల్యేకు రూ.1000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు.

ఒడిశా విద్యాశాఖ మంత్రికి జరిమానా

అనంతరం ఎమ్మెల్యే స్వరూప్​ దాస్ స్థానిక​ ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి జరిమానా చెల్లించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అంతకుముందు ఎమ్మెల్యే స్వరూప్ దాస్​తో కలిసి బాలేశ్వర్​లోని పట్టణంలోని వివిధ పాఠశాలల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు విద్యాశాఖ మంత్రి సమీర్​ రంజన్ దాస్. బాలేశ్వర్ టౌన్​ హైస్కూల్, బారాబతి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చదవండి: మంత్రి ఇంటి ముందు అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా

8వ అంతస్తు పిట్టగోడపై కూర్చొని రోగి హల్​చల్​.. చివరకు కిందపడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.