ETV Bharat / bharat

Newsclick Office Raid : న్యూస్​క్లిక్​పై కొత్త కేసు.. సంస్థ కార్యాలయంతో పాటు జర్నలిస్టుల ఇళ్లపై దాడులు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 12:50 PM IST

Updated : Oct 3, 2023, 1:38 PM IST

Newsclick Office Raid : చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్​క్లిక్​ పోర్టల్​పై మరో కొత్త కేసు నమోదు చేశారు దిల్లీ స్పెషల్​ సెల్​ పోలీసులు. ఆ సంస్థకు చెందిన కార్యాలయంతో, జర్నలిస్టుల ఇళ్లు సహా 30 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. న్యూస్​క్లిక్​ ఎడిటర్​ ఇన్ చీఫ్​తో పాటు పలువురు జర్నలిస్టులను స్పెషల్​ సెల్​ పోలీసులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.

Newsclick Office Raid
Newsclick Office Raid

Newsclick Office Raid : మనీ లాండరింగ్‌తోపాటు చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌ క్లిక్‌పై.. దిల్లీ పోలీసులు మరో కొత్త కేసు నమోదు చేశారు. ఆ సంస్థకు చెందిన దిల్లీ కార్యాలయంతో పాటు దేశ రాజధాని ప్రాంతం- ఎన్​సీఆర్​లోని న్యూస్‌క్లిక్​ సిబ్బంది నివాసాలతో సహా 30 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. న్యూస్‌ క్లిక్‌కు చెందిన కొందరు జర్నలిస్టుల ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్ల నుంచి డేటా తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొందరు జర్నలిస్టులతో పాటు సంస్థ వ్యవస్థాపకులు ప్రబీర్ పుర్కాయస్థను దిల్లీ ప్రత్యేక విభాగం కార్యాలయానికి తీసుకెళ్లారు.

అయితే ఇంతవరకు ఎవరినీ కూడా అరెస్ట్‌ చేయలేదని అధికారవర్గాలు తెలిపాయి. పోలీసు దాడుల విషయాన్ని ఇద్దరు జర్నలిస్టులు ధ్రువీకరించారు. తమ ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. అంతకుముందు న్యూస్​క్లిక్​కు​ ఫండింగ్​ ఎక్కడినుంచి వస్తుందనే విషయమై దిల్లీలోని ఆ సంస్థ కార్యాలయంపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ ఇచ్చిన సమాచారంతోనే ప్రస్తుతం దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం పోలీసులు దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.

  • #WATCH | Founder and Editor-in-Chief of NewsClick Prabir Purkayastha brought to Delhi Police Special Cell office.

    Delhi Police is conducting raids at different premises linked to NewsClick under UAPA and other sections. pic.twitter.com/rDZEqZGn0z

    — ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు, ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బిహార్ కులగణన ద్వారా బయటపడిన సంచలన విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని మండిపడింది. దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్​ పెరుగుతోందని, దీన్ని కప్పిపుచ్చేందుకు దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు. దిల్లీ పోలీసు దాడులపై ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలతో ఓ ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపింది.

  • The Press Club of India is deeply concerned about the multiple raids conducted on the houses of journalists and writers associated with #Newsclick.

    We are monitoring the developments and will be releasing a detailed statement.

    — Press Club of India (@PCITweets) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆరోపణలు ఇవీ..
ఆగస్టు 5న అమెరికాకు చెందిన న్యూ యార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికాకు చెందిన మిలియనీర్‌ నెవిల్‌ రాయ్‌ సింగం నుంచి గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్‌ నిధులు పొందినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. ఆ తర్వాత ఆగస్టు 17న చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ)- ఉపా చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.

'ఉపా' దుర్వినియోగంతో మానవ హక్కుల విలవిల

'హీరో' ఛైర్​పర్సన్ ఇంటిపై ఈడీ దాడులు.. రూ.25 కోట్ల ఆస్తులు సీజ్.. డైమండ్ ఆభరణాలు సైతం..

Last Updated :Oct 3, 2023, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.