ETV Bharat / bharat

Covid in india: దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు

author img

By

Published : Jul 29, 2021, 9:35 AM IST

Updated : Jul 29, 2021, 9:47 AM IST

దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు(covid in india) నమోదయ్యాయి. మరో 640 మంది మృతి చెందారు.

corona cases in india
దేశంలో కరోనా కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి(covid in india) క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 43,509 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. 38,465 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 97.38శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు: 3,15,28,114
  • మొత్తం మరణాలు: 4,22,662
  • కోలుకున్నవారు: 3,07,01,612
  • యాక్టివ్​ కేసులు: 4,03,840
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వ్యాక్సినేషన్:

దేశంలో ఇప్పటివరకు 45,07,06,257 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 43,92,697 డోసులు అందించినట్లు తెలిపింది.

పరీక్షలు

బుధవారం 17,28,795 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. వీటితో కలిపి ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 46,26,29,773కు చేరినట్లు చెప్పింది.

ఇవీ చూడండి:

Last Updated :Jul 29, 2021, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.