'అగ్నిపథ్​లో ఎన్​సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు'

author img

By

Published : Jun 24, 2022, 4:07 PM IST

agneepath scheme

AGNEEPATH SCHEME: ఎన్​​సీసీ క్యాడెట్లుకు సైనిక నియామక ప్రక్రియ 'అగ్నిపథ్' పథకంలో బోనస్​ పాయింట్లు లభిస్తాయని ఎన్​సీసీ​ డైరెక్టర్ జనరల్ గుర్బీర్​పాల్ సింగ్ అన్నారు. అగ్నిపథ్​లో యువకులు భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు.

AGNEEPATH SCHEME: సాయుధ బలగాల నియామక ప్రక్రియ అగ్నిపథ్​ పథకంలో ఎన్​సీసీ క్యాడెట్​లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్​ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్​పాల్ సింగ్ అన్నారు. ఎన్​సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్​ ఉన్నవారందరికి బోనస్​ పాయింట్లు లభిస్తాయని వెల్లడించారు. గ్వాలియర్​లో జరిగిన ఎన్‌సీసీ మహిళా ఆధికారుల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎన్​సీసీ అధికారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అకాడమీలో మూడు నెలల శిక్షణ తీసుకున్న 122 మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికారులుగా వెళ్తున్నారు. మీరందరూ సాయుధ దళాల్లో యువకులు ఎక్కువ సంఖ్యలో చేరేలా కృషి చేయాలని గుర్బీర్​పాల్ ఎన్​సీసీ మహిళా అధికారులకు సూచించారు. 1950 నుంచి ఎన్‌సీసీలో మహిళా క్యాడెట్‌లు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

అగ్నిపథ్​ ద్వారా త్రివిధ దళాల్లో చేరే వారిని అగ్నివీర్లుగా పిలుస్తారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, హరియాణా, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. సాయుధ బలగాల్లో యువతను చేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

ఇవీ చదవండి: ద్రౌపది నామినేషన్.. సోనియా, మమతతో సంప్రదింపులు

'ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పవార్​ను బెదిరిస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.