ETV Bharat / bharat

'సీఎంకు చెంపదెబ్బ'పై దుమారం.. రెండు పార్టీల కార్యకర్తల ఘర్షణ

author img

By

Published : Aug 24, 2021, 11:52 AM IST

Updated : Aug 24, 2021, 2:38 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ్​ రాణె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయగా.. రాణెపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాణె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన శివసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. మరోవైపు.. రాణె తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

narayana rane comments
సీఎంపై చెప్పుదెబ్బ వ్యాఖ్యలు

ముంబయిలో శివసేన కార్యకర్తల ఘర్షణ

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేను ఉద్దేశించి కేంద్రమంత్రి నారాయణ్‌రాణె....చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని కేంద్రమంత్రి రాణె ఇటీవల వ్యాఖ్యానించారు. రాణె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన శివసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. నాసిక్‌లోని భాజపా కార్యాలయంపై రాళ్లురువ్వారు. నాసిక్‌సహా పలు ప్రాంతాల్లో శివసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

శివసేన శ్రేణుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నాసిక్‌ పోలీసులు.. కేంద్ర మంత్రి కోసం ఓ బృందాన్ని పంపినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి ఎక్కుడున్నా.. కోర్టులో హాజరుపర్చనున్నట్లు నాసిక్‌ పోలీసు కమిషనర్‌ దీపక్​ పాండే తెలిపారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పారు.

'నేను సాధారణ వ్యక్తిని కాను'

మరోవైపు కేంద్ర మంత్రి నారాయణ రాణె తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఆగస్టు 15 గురించి తెలియనివారికి చెప్పడం నేరమేమీ కాదని అన్నారు.

"నాపై ఎఫ్​ఐర్​ నమోదైందన్న విషయం నాకు తెలియదు. నేను సాధారణ వ్యక్తిని కాను. నేను ఏ నేరం చేయలేదు. ఆగస్టు 15 గురించి ఎవరికైనా తెలియకపోతే...నేరం కాదా? నేను అక్కడ ఉండి ఉంటే చెప్పదెబ్బ కొట్టేవాడినని మాత్రమే అన్నాను. ఇలా మాట్లాడటం నేరమేమీ కాదు."

-నారాయణ రాణె, కేంద్ర మంత్రి.

నారాయణ రాణె ఇంటివద్ద కూడా శివసేన కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. రాణెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా కార్యకర్తలతో ఘర్షణకు దిగారు.

Last Updated :Aug 24, 2021, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.