ETV Bharat / bharat

'నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారు'

author img

By

Published : Jul 5, 2021, 1:05 PM IST

నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారని లోక్​ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాసవాన్​ అన్నారు. తండ్రి రామ్​ విలాస్​ పాసవాన్​ జయంతి సందర్భంగా 'ఆశీర్వాద్​ యాత్ర'ను ప్రారంభించారు. బిహార్​ ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి ఈ యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు.

Chirag Paswan
చిరాగ్​ పాసవాన్​

తన సొంత మనుషులే తనకు ద్రోహం చేశారని లోక్ ​జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) నేత చిరాగ్​ పాసవాన్​ అన్నారు. తన తండ్రి రామ్​ విలాస్​ పాసవాన్​ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను 'ఆశీర్వాద్​ యాత్ర' చేపడుతున్ననట్లు పేర్కొన్నారు.

"నా అనుకున్న వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు. నా తండ్రి కర్మభూమి అయిన హాజీపుర్​ నుంచి ఆశీర్వాద్​ యాత్రను ప్రారంభిస్తున్నాను. ఇది ప్రతీ జిల్లాలో జరుగుతుంది. ప్రతీ ఒక్కరి ఆశీర్వాదం తీసుకోవడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. నా బలం చూపించేందుకు నాకు శక్తి లేదు. నా అనుకున్న వాళ్లే నాకు ద్రోహం చేశారు."

-చిరాగ్​ పాసవాన్​, ఎల్​జేపీ నాయకుడు

'నాకు బిహార్ ప్రజల ఆశీర్వాదం కావాలి. నాకు ఇప్పుడు ఎవరూ లేరు ప్రజలు తప్ప. ఈ యాత్రకు ప్రత్యేకత ఏం లేదు. ఈ రోజు మా నాన్నకు నివాళులర్పించడానికి నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. ఇదే రోజున బాబాయి, నా సోదరులు మాతో ఉంటారు అనుకున్నా.. కానీ లేరు.' అని చిరాగ్​ అన్నారు. అనంతరం ఆశీర్వాద్​ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిరాగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'పాసవాన్​' అనే పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ నివాళి...

  • Today is the birth anniversary of my friend, late Ram Vilas Paswan Ji. I miss his presence greatly. He was one of India’s most experienced Parliamentarians and administrators. His contributions to public service and empowering the downtrodden will always be remembered.

    — Narendra Modi (@narendramodi) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లోక్​ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత రామ్​ విలాస్​ పాసవాన్​కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాలు వారి అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికి మరువలేమని కొనియాడారు.

ఇదీ చూడండి: వేడెక్కిన రాజకీయం- చిన్న పార్టీలతోనే అసలు చిక్కులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.