ETV Bharat / bharat

'వారణాసిలో శరవేగంగా అభివృద్ధి పనులు'

author img

By

Published : Dec 14, 2021, 4:22 PM IST

Modi in UP today: ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని స్వర్​వేద్ మహామందిర్​లో జరిగిన సద్గురు సదాఫల్దేవ్ విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షిక ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వారణాసిలో అభివృద్ధ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.

modi in up today
'వారణాసిలో శరవేగంగా అభివృద్ధి పనులు'

Modi in UP today: వారణాసి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నగరాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

స్వర్​వేద్ మహామందిర్​లో జరిగిన సద్గురు సదాఫల్దేవ్ విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా ఈ సభకు హాజరయ్యారు.

modi in up today
మోదీ- యోగి ఆదిత్యనాథ్​
modi in up today
కార్యక్రమంలో మోదీ-యోగి

ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలను ప్రజలకు వివరించారు మోదీ. తాను దిల్లీలో ఉన్నా.. వారణాసిపైనే మనసు ఉంటుందని, ఇక్కడి అభివృద్ధిని చూసేందుకు తహతహలాడతానని మోదీ అన్నారు.

modi in up today
సద్గురు సదాఫల్దేవ్​కు మోదీ సమస్కారం
modi in up today
స్వర్​వేద్​ మహామందిర్​

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.