ETV Bharat / bharat

దళితుడిపై మూకదాడి, బలవంతంగా మూత్రం తాగించి

author img

By

Published : Aug 27, 2022, 6:52 AM IST

brutally attack in Darbhanga bihar
brutally attack in Darbhanga bihar

దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ దళితుడిపై మూకదాడి చేశారు దుండగులు. అతడి చేతులు, కాళ్లు కట్టేసి కర్రలతో దాడికి పాల్పడింది అల్లరిమూక. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బిహార్ దర్భంగాలో ఈ దారుణం జరిగింది. మరోవైపు, బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తిని దాడి చేసి హతమార్చారు దుండగులు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

బిహార్‌లోని దర్భంగాలో దారుణ ఘటన జరిగింది. దొంగతనానికి పాల్పడ్డాడని ఓ దళితుడిపై మూకదాడికి దిగారు దుండగులు. ఈ దాడిలో బాధితుడి ఎముకలు విరగ్గొట్టారు. దాహం వేస్తుందంటూ బాధితుడు నీరు అడడగా.. బలవంతంగా అతడితో మూత్రాన్ని తాగించారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దళితుడిపై దాడి విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

పోలీసులు వివరాల ప్రకారం.. దర్భంగాలోని కియోటి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజోరా గ్రామానికి చెందిన రామ్ ప్రకాశ్ పాసవాన్​ అనే దళితుడు దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతడిపై దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండగులు కర్రలతో కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారడం వల్ల ఈ దారుణం బయటపడింది. కొంతమంది దుండగులు బాధితుడు రామ్ ప్రకాశ్ పాసవాన్​.. చేతులు, కాళ్లను తాడుతో కట్టి కర్రలతో అతడిపై దాడి చేశారు.

"ఆగస్టు 16 రాత్రి మధుబనీలోని మా అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచి నా తండ్రి వస్తున్నాడు. అతను రహికా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిజ్రా గ్రామానికి చేరుకున్నప్పుడు ఎవరో ఆగమని పిలిచారు. ఆ తర్వాత కొందరు వచ్చి దాడికి పాల్పడ్డారు. కర్రలతో చేతులు, కాళ్ల మీద కొట్టారు. ప్రస్తుతం నాన్న పరిస్థితి విషమంగా ఉంది."

- పూజా కుమారి, బాధితుడి కుమార్తె

బైక్​పై వెళ్తున్న వ్యక్తిపై..: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి హతమార్చారు దుండగులు. ఈ ఘటన కర్ణాటక.. బెల్గాంలోని హలగా గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. మృతుడిని మునవల్లికు చెందిన హిరేమత్​గా(40) గుర్తించారు పోలీసులు. పదునైన ఆయుధంతో ఈ హత్య చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నట్లు హిరేబాగేవాడి పోలీసులు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

భార్య మరణించిందనే మనస్తాపంతో..: ఉత్తర్​ప్రదేశ్​ ​ఫరూఖాబాద్​లో దారుణం జరిగింది. ఓ ఉపాధ్యాయుడు తన ఇద్దరు కుమార్తెలను చంపి.. తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ జాతవ్ (38), అతని ఇద్దరు కుమార్తెలు షగుణ్ (7), సృష్టి (11) మృతదేహాలు బెడ్​పై పడి ఉండడం వల్ల గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. భార్య మరణించిందనే మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.

మొండెం లేని నవజాత శిశువు..: ఉత్తరాఖండ్ ముస్సోరీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తలలేని నవజాత శిశువు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పాత కక్షలతో..: పాత కక్షలతో ఓ యువకుడిని పదునైన ఆయుధాలతో పొడిచి చంపింది ఓ ముఠా. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​ కోర్బాలోని సీతామడీలో జరిగింది. ఈ ఘటనలో కృష్ణ యాదవ్​(26) అనే యువకుడు మృతి చెందాడు. కృష్ణాష్టమి సమయంలో జరిగిన వివాదమే ఈ దాడికి కారణమని మృతుని తమ్ముడు పోలీసులకు తెలిపాడు. 40 నుంచి 50 మంది దుండగులు గురువారం అర్ధరాత్రి తమ ఇంట్లోకి ప్రవేశించి తన అన్నపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దళిత విద్యార్థిని చితకబాదిన టీచర్​..: రాజస్థాన్​ పాలీలో దళిత విద్యార్థిని ఓ టీచర్ తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమించడం వల్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడిపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు భన్వర్ సింగ్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బుధవారం బగ్డీ ఉన్నత పాఠశాలలో జరిగింది. బాలుడు తోటి విద్యార్థులతో మాట్లాడుతున్నాడని ఉపాధ్యాయుడు అతడిని కొట్టాడని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం అదే కావాలన్న జస్టిస్ రమణ

మన ప్లాన్​ ఇది కాదు కదా, ఆజాద్​ రాజీనామాపై జీ23 నేతల రియాక్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.