ETV Bharat / bharat

మిజోరంలో మేజిక్ ఫిగర్​ దాటిన ప్రతిపక్ష ZPM- ముఖ్యమంత్రి అభ్యర్థి గెలుపు

author img

By PTI

Published : Dec 4, 2023, 8:01 AM IST

Updated : Dec 4, 2023, 2:02 PM IST

Mizoram Election Result 2023 in Telugu : మిజోరం శాసనసభ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్​ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది ప్రతిపక్ష జోరం పీపుల్స్​ మూవ్​మెంట్​.

Mizoram Election Result 2023 in Telugu
Mizoram Election Result 2023 in Telugu

  • 2.00PM
    ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్‌ (MNF)కు గట్టి షాక్‌ తగిలింది. ఏకంగా ముఖ్యమంత్రి జోరంథంగా సహా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. సోమవారం వెలువడుతున్న ఫలితాల్లో ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM) స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. దీంతో జడ్‌పీఎం అధ్యక్షుడు లాల్డుహోమా నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది.

రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 స్థానాలు అవసరం. ప్రస్తుతం జడ్‌పీఎం పార్టీ 21 స్థానాల్లో విజయం సాధించి.. మరో 6 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, ఎంఎన్‌ఎఫ్‌ పార్టీ 6 చోట్ల గెలిచి మరో 4 స్థానాల్లో ముందంజలో ఉంది. రెండు చోట్ల భాజపా, ఒక చోట కాంగ్రెస్‌ గెలుపొందింది.

1.32 PM

మిజోరంలో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్​మెంట్​ పార్టీ మేజిక్ ఫిగర్​ దాటింది. మొత్తం 40 స్థానాలకు గాను 21 స్థానాల్లో విజయం సాధించింది. మరో 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్​ 7 సీట్లు గెలవగా, మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ రెండింట్లో గెలవగా, కాంగ్రెస్​ ఒక చోట ఆధిక్యంలో ఉంది.

12.50 PM

జోరం పీపుల్స్ మూవ్​మెంట్​ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి లల్దుహోమా గెలుపొందారు. సెర్చిప్​ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. కాగా ప్రస్తుత సీఎం జోరంథంగా వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం ZPM 14 స్థానాల్లో విజయం సాధించగా, మరో 13 సీట్లలో ఆధిక్యంలో ఉంది. MNF 3 సీట్లలో గెలవగా, 7 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యంలో ఉంది.

12.25 PM

మిజోరంలో జోరం పీపుల్స్ మూవ్​మెంట్​ పార్టీ మెజారిటీ దిశగా వెళ్తోంది. ఇప్పటికే 11 స్థానాల్లో విజయం సాధించింది. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార MNF ఒక సీటు గెలవగా, 10 స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ ఒక చోట గెలవగా, మరో చోట ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూడా ఒక చోట ఆధిక్యంలో కొనసాగుతోంది.

11.45 AM

మిజోరం గ్రామీణాభివృద్ధి మంత్రి లాల్రౌత్​కిమా ప్రతిపక్ష ZPM అభ్యర్థి లాల్నింగ్లోవా హమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. వైద్యారోగ్య మంత్రి ఆర్​ లల్తన్​గ్లియానా సైతం ZPM అభ్యర్థి జేజే లల్పేఖులా చేతిలో ఓడిపోయారు. ప్రతిపక్ష ZPM ఇప్పటికి ఐదు సీట్ల్లు గెలుపొందగా, మరో 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. MNF 11 స్థానాల్లో, బీజేపీ 2, కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యంలో ఉంది.

11.20 AM
మిజోరంలో జోరం పీపుల్స్ మూవ్​మెంట్​ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే 2 స్థానాల్లో గెలుపొందగా, మరో 24 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష MNF 10 స్థానాల్లో, బీజేపీ 3, కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యంలో ఉంది.

10.50 AM

మిజోరంలో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్​మెంట్​ పార్టీ ఇప్పటికే 2 స్థానాల్లో గెలుపొందింది. మరో 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార MNF 7 స్థానాల్లో, బీజేపీ 3, కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలపై స్పందించారు ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి లల్దుహోమా. తానేమి ఆశ్చర్యానికి గురికాలేదని, తాను ఊహించిన ఫలితాలే వచ్చాయన్నారు.

10.22 AM

మిజోరం ఎన్నికల్లో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్​మెంట్​ పార్టీ బోణీ కొట్టింది. తుయిచాంగ్​ నుంచి పోటీ చేస్తున్న ఉపముఖ్యమంత్రి తవ్నలుయా ZPM అభ్యర్థి ఛునావమా చేతిలో ఓడిపోయారు.

10.06 AM

మిజోరంలో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్​మెంట్​ పార్టీ దూసుకుపోతుంది. 40 అసెంబ్లీ సీట్లు ఉండగా, సగానికి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్​ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

9.33AM

మిజోరంలో ప్రారంభ ఫలితాల సరళిలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) కంటే ప్రతిపక్ష జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) ముందంజలో దూసుకుపోతుంది. ZPM 11 స్థానాల్లో ముందంజలో ఉండగా, MNF ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

  • 8.40AM
    మిజోరం ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనేక ప్రాంతాల్లో పూర్తైంది. దీంతో ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు తీసి ఈవీఎంలను బయటకు తీశారు అధికారులు.
  • 8.00AM

Mizoram Election Result 2023 in Telugu : ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికల పోలింగ్​కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 13 కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ముందుగా ఉదయం 8.30 గంటల వరకూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను, ఆపై ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నట్లు మిజోరం అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్‌.లియాంజెలా తెలిపారు. ఇందులో మొత్తం నాలుగు వేల మంది సిబ్బంది పాలు పంచుకుంటున్నారు.

వాస్తవానికి మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్​ 3నే జరగాల్సి ఉంది. కానీ, వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు డిసెంబర్​ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. మిజోరంలో ఒకే విడతలో నవంబర్​ 7వ తేదీన ఎన్నికలు జరిగాయి. 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాల్లో ఆరోజు సాయంత్రం 5గంటల వరకు 77.04శాతం పోలింగ్‌ నమోదైంది. సెర్చిప్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో 83.96శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు.

మిజోరంలో ఎవరో?
మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో త్రిముఖ పోరు నెలకొంది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF), కాంగ్రెస్‌, జోరం పీపుల్స్‌ మూమెంట్ (ZPM) మధ్యే ప్రధాన పోటీ. బీజేపీ సైతం పోటీలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంఎన్‌ఎఫ్‌కు, జడ్‌పీఎంకు మధ్య గట్టిపోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజపా ప్రభావం నామమాత్రమే. కాంగ్రెస్‌ కొన్నిసీట్లలో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకు ఒకటీ, రెండు కూడా కష్టమే.

Last Updated : Dec 4, 2023, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.