ETV Bharat / bharat

ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన ఇండిగో ఫ్లైట్స్​.. లక్కీగా...

author img

By

Published : Jan 19, 2022, 6:01 PM IST

Mid air collision Indigo: కేవలం ఐదు నిమిషాల తేడాతో గాల్లోకి ఎగిరిన రెండు విమానాలు కొద్దిసేపటికే అతి దగ్గరగా వచ్చాయి. అయితే, రాడార్​ కంట్రోలర్​ హెచ్చరికలతో త్రుటిలో ప్రమాదం తప్పింది. జనవరి 9న బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

mid air collision indigo
ఆకాశంలో అతి దగ్గరగా వచ్చిన రెండు విమానాలు

Mid air collision Indigo: రెండు ఇండిగో విమానాలు ఆకాశంలోకి ఎగిరిన కొద్ది సమయానికే అతి దగ్గరగా వచ్చాయి. అయితే, రాడార్​ వ్యవస్థ హెచ్చరించటం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పింది. బెంగళూరు విమానాశ్రయంలో ఈ సంఘటన జనవరి 9న జరిగినట్లు విమానాయన నియంత్రణ సంస్థ డీజీసీఏ బుధవారం తెలిపింది. కానీ, ఈ దీని గురించి లాగ్​బుక్​లో ఏమీ నమోదు చేయలేదని, ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ)కి నివేదించలేదని పేర్కొంది.

ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని, తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు డీజీసీఏ చీఫ్​ అరుణ్​ కుమార్​. మరోవైపు.. ఈ సంఘటనపై ఇండిగో, ఏఏఐ స్పందించేందుకు నిరాకరించాయి.

ఇండిగో విమానాలు 6E455(బెంగళూరు నుంచి కోల్​కతా),6E246( బెంగళూరు నుంచి భువనేశ్వర్​) బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరే క్రమంలో నిబంధనలను అతిక్రమించినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. జనవరి 9న ఉదయం కేవలం 5 నిమిషాల తేడాతోనే బెంగళూరు విమానాశ్రయం నుంచి రెండు విమానాలు బయలుదేరాయన్నారు. 'విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరాక రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. రాడార్​ కంట్రోలర్​ హెచ్చరికతో దూరంగా వెళ్లటం వల్ల ఆకాశంలో విమానాలు ఢీకొట్టే ప్రమాదం తప్పింది.' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.