ETV Bharat / bharat

డ్రోన్లతో ఇంటికే మెడిసిన్​- దేశంలో తొలిసారి

author img

By

Published : Jun 19, 2021, 10:16 PM IST

Updated : Jun 19, 2021, 10:43 PM IST

drone, medicine
డ్రోన్ సప్లై, మెడిసిన్

డ్రోన్​ల సాయంతో ఇంటికే మెడిసిన్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ. ఈ మేరకు 30-45 రోజుల పాటు ట్రయల్స్ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 21 నుంచి ట్రయల్స్ ప్రారంభించనుంది.

దేశంలోనే తొలిసారి డ్రోన్​ల ద్వారా మెడిసిన్ సరఫరా చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థ సన్నద్ధమవుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్​ 21 నుంచి కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూర్​ తాలుకాలో ట్రయల్స్ జరపనున్నట్లు పేర్కొంది. అయితే.. దీనికంటే ముందే.. రెండు డ్రోన్​ల ద్వారా మెడిసిన్ సరఫరా ట్రయల్స్ జరపుతోంది.

drone, medicine
ట్రయల్​కు ఉపయోగించనున్న డ్రోన్

బెంగళూరుకు చెందిన టీఏఎస్​ సంస్థ.. ఈ డ్రోన్​ సరఫరాపై ట్రయల్స్ జరుపుతోంది. నారాయణ హెల్త్​ కేర్​ భాగస్వామ్యంతో.. 30-45 రోజుల పాటు మెడికల్​ సరఫరా ట్రయల్స్ జరపనుంది టీఏఎస్.

drone, medicine
డ్రోన్​ ద్వారా మెడిసిన్ సప్లై

రెండు డ్రోన్లు...

మెడ్ కాప్టర్, రాన్​డింట్ అనే రెండు డ్రోన్​లను ఈ సంస్థ ఉపయోగిస్తోంది. మెడ్​ కాప్టర్​ 15 కిలోమీటర్ల దూరం వరకు కేజీ బరువున్న వస్తువులను మోసుకెళ్లగలదు. రాండింట్.. 2 కేజీల బరువున్న వస్తువులను 12 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లగలదు. అయితే.. డ్రోన్​లో చిన్న లోపాలు రావడం వల్ల ట్రయల్స్ మరింత ఆలస్యమైట్లు టీఏఎస్​ సంస్థ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:డ్రోన్ల ద్వారా టీకాల సరఫరా!

Last Updated :Jun 19, 2021, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.