ETV Bharat / bharat

మణిపుర్​లో మళ్లీ హింస- కాల్పుల్లో ఐదుగురు మృతి- మహిళల నిరసన ర్యాలీ

author img

By PTI

Published : Jan 19, 2024, 7:26 AM IST

Manipur Violence News : మణిపుర్​లో మళ్లీ హింస చెలరేగింది. గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు జరిగినట్లు అధికారులు తెలిపారు. భద్రతా దళాలు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.

Manipur Violence News
Manipur Violence News

Manipur Violence News : మణిపుర్​లో సాయుధ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. బిష్ణుపుర్ జిల్లాలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను తుపాకులతో దారుణంగా కాల్చిచంపారు దుండగులు. నింగ్​తౌఖోంగ్ ఖా ఖునౌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారిలో తండ్రీ కొడుకులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ కొండ ప్రాంతం నుంచి వచ్చిన ఐదారుగురు దుండగులు వ్యవసాయ కూలీలను బంధించి పాయింట్ బ్లాంక్ రేంజ్​లో కాల్చినట్లు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి అడవుల్లోకి పారిపోయారని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరో ఘటనలో సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో ఓ గ్రామ వాలంటీర్ కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. కంగ్​పోక్పీ జిల్లాలో రెండు వైరి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి కాల్పులకు దారి తీసినట్లు పోలీసులలు వెల్లడించారు. కొండ ప్రాంతాలకు చెందిన మిలిటెంట్లు కంగ్​చుప్ గ్రామంపై దాడికి దిగారని చెప్పారు. దీంతో గ్రామస్థులు సైతం ప్రతిదాడులు చేశారని చెప్పారు.

నిరసన ర్యాలీ
వాలంటీర్ మరణం తర్వాత ఇంఫాల్​లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన యూనిఫైడ్ కమాండ్ ఛైర్మన్​ కుల్దీప్ సింగ్​ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం నివాసం, రాజ్​భవన్ వరకు మహిళలు ర్యాలీగా వెళ్లారు. రాజ్​భవన్​కు 300 మీటర్ల దూరంలో మహిళలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా- ఘర్షణ తలెత్తింది. దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు.

ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని ఫాయెంగ్, కదంగ్​బంద్, కౌట్రక్ ప్రాంతాలతో పాటు ఇంఫాల్ ఈస్ట్, కంగ్​పోక్పీ, బిష్ణుపుర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో తెగల మధ్య కాల్పులు జరిగాయని చెప్పారు. భద్రతా దళాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాయని చెప్పారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు మణిపుర్​లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పోలీసు కమాండోలతో సహా మొత్తం ఏడుగురు హత్యకు గురయ్యారు. మోరే జిల్లాలో ఇద్దరు పోలీసులను హత్య చేసిన ఘటనల్లో మయన్మార్ మిలిటెంట్ల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పడవ బోల్తాపడి 14మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి- విహార యాత్రకు వెళ్లగా ప్రమాదం

రైలు ఢీకొని నలుగురు మృతి- ట్రాక్​ దాటుతుండగా ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.