ETV Bharat / bharat

ప్రియురాలిపై కోపంతో.. ఇద్దరిని కత్తితో పొడిచాడు

author img

By

Published : Dec 14, 2021, 10:52 PM IST

ప్రియురాలిపై కోపంతో వ్యక్తి సిక్కిం ఆసుపత్రిలోని వైద్యునితో పాటు.. అటెండర్‌ని కత్తితో పొడిచాడో వ్యక్తి. సిక్కింలోని ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన జరిగింది.

stabbed
కత్తితో పొడిచి

ప్రియురాలు తనతో మాట్లాడేందుకు నిరాకరించిందనే కోపంతో వైద్యుడితో పాటు.. అటెండర్‌ని కత్తితో పొడిచాడో వ్యక్తి. సిక్కింలోని గ్యాంగ్‌టక్‌ ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

తటాంగ్‌చెన్‌కి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితురాలిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు. అతనిపై కోపంతో ఉన్న ఆమె.. మాట్లాడేందుకు నిరాకరించింది. అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు వచ్చానని తన వద్దకు రావొద్దని తెగేసి చెప్పంది. ఆమె మాటలు పట్టించుకోని నిందితుడు.. పదేపదే ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు. మాట్లాడాలని, తనతో రావాలని కోరాడు. కానీ ఆమె నిరాకరించింది. దీనితో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి తనవెంట తెచ్చుకున్న కత్తితో సమీపంలో ఉన్న వైద్యుడి వీపుపై పొడిచాడు.

చేతిలో కత్తి, దుస్తులపై రక్తపు మరకలతో ఆసుపత్రిలో చాలాసేపు సంచరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు చేరుకునే లోపే అటెండర్​పైనా దాడికి పాల్పడ్డాడు. దీనితో ఆసుపత్రిలో భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వైద్యుడితో పాటు.. అటెండర్‌ అయిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుడి పరిస్థితి విషమంగా ఉందని సిబ్బంది తెలిపారు.

అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కత్తితో ఆసుపత్రికి ఎందుకు వచ్చావని ప్రశ్నించగా.. ప్రభుత్వాధికారి అయిన తన బావను చంపడానికి అని సమాధానమివ్వడం గమనార్హం. నిందితుడికి తన బావమరిదితో ఆర్థిక తగాదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.