ETV Bharat / bharat

భార్య, మరదలిని హత్య చేసి.. ఇంట్లోనే దాచిపెట్టి..

author img

By

Published : Apr 24, 2022, 10:56 PM IST

man kills wife Odisha: భార్యతో పాటు ఆమె చెల్లెలిని హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్​లో జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

man kills wife Odisha
భార్యను చంపిన భర్త

man kills wife Odisha: భార్య, మరదలిని అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశా, భువనేశ్వర్​లోని చంద్రశేఖర్​పుర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈనెల 21 ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అయితే.. జంట హత్యలకు గల కారణాలు స్పష్టంగా తెలియలేదని పేర్కొన్నారు.

man kills wife Odisha
నిందితుడు బిజయ్​కేతన్

ఇదీ జరిగింది: నిందితుడు బిజయ్​కేతన్.. తన భార్య గాయత్రితో పాటు ఆమె చెల్లెలు సరస్వతిని హత్య చేసి.. మృతదేహాలను ఇంట్లో దాచాడు. ప్రతి రోజు వచ్చి ఇంట్లోని మృతదేహాలను పరిశీలించేవాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుంటే మృతులు గాయత్రి, సరస్వతి మొబైల్స్ స్విచ్చాఫ్ వచ్చేవి. నిందితుడు బిజయ్​కేతన్​కు ఫోన్ చేస్తే ఎత్తేవాడు కాదు. ఇంట్లోంచి వస్తున్న దుర్వాసనతో ఇరుగు పొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ తగాదాల కారణంగానే నిందితుడు ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

man kills wife Odisha
నిందితుడి భార్య గాయత్రి

బిజయ్​కేతన్- గాయత్రి దంపతులకు 2011లో వివాహమైంది. గాయతి చెల్లెలు సరస్వతి.. నర్సుగా ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తోంది. అప్పుడప్పుడు గాయత్రి వాళ్ల ఇంటికి వస్తుండేది. అలా ఈసారి వచ్చి అనంత లోకాలకు వెళ్లిపోయింది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డలకు న్యాయం చేయాలని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

man kills wife Odisha
నిందితుడి మరదలు సరస్వతి

ఇదీ చదవండి: బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని చితకబాది అర్ధనగ్నంగా ఊరేగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.