ETV Bharat / bharat

'టీకా వల్లే నా కూతురు మృతి.. వాళ్లు రూ.1000కోట్లు చెల్లించాలి'

author img

By

Published : Feb 2, 2022, 11:07 AM IST

COVID vaccine death: కరోనా టీకా తీసుకున్న తర్వాత సైడ్​ ఎఫెక్ట్స్​ కారణంగా తన కూతురు చనిపోయిందని హైకోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి. ప్రభుత్వం, టీకా తయారు చేసిన సంస్థ రూ.1000కోట్లు చెల్లించేలా ఆదేశించాలని పిటిషన్​లో పేర్కొన్నాడు.

Man claims daughter died of COVID-19 vaccine side effects
'టీకా వల్లే నా కూతురు మృతి.. వాళ్లు రూ.100కోట్లు చెల్లించాలి'

COVID vaccine death: మహారాష్ట్ర ఔరంగాబాద్​కు చెందిన ఓ వ్యక్తి కరోనా టీకా దుష్ప్రభావాల కారణంగా తన కుమార్తె చనిపోయిందని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. మహారాష్ట్ర ప్రభుత్వం, సీరం సంస్థలను రూ.1000కోట్లు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని పటిషన్​లో కోరాడు. వైద్య విద్యార్థిని అయిన తన కూతురు గతేడాది జనవరిలో వ్యాక్సిన్ తీసుకుందని, ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్​ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని వివరించాడు.

" నా కూతురు స్నేహాల్.. నాశిక్​లో వైద్య విద్యార్థిని. వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో భాగంగా ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినందున ఆమె గతేడాది కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకుంది. కరోనా టీకా సురక్షితమని, ఎలాంటి హాని ఉండదని చెప్పారు. అది నమ్మి వైద్య కళాశాలలో నా కూతురు వ్యాక్సిన్​ తీసుకుంది. ఆమె ఆరోగ్య కార్యకర్తగా కూడా సేవలందించింది. టీకా సురక్షితమని డీజీసీఐ, ఎయిమ్స్​, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెప్పడం వల్ల నా కూతురు లాంటి ఆరోగ్య కార్యకర్తలు ఎంతో మంది వ్యాక్సిన్​ తీసుకున్నారు. కొవిషీల్డ్ టీకా దుష్ప్రభావాల కారణంగానే నా కుమార్తె మృతి చెందిందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన AEFI కమిటీ గతేడాది అక్టోబర్​ 2న చెప్పింది. నా కుతురుకి న్యాయం చేయాలని, అలాగే ఆమె లాంటి ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నా.

-దిలీప్​ లునావత్, పిటిషనర్.

తన కూతురు 2021 జనవరి 28న టీకా తీసుకుందని, ఆ తర్వాత దుష్ప్రభావాల కారణంగా మార్చి 1న మరణించిందని లునావత్ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే దీన్ని గతవారమే దాఖలు చేయగా.. హైకోర్టు విచారణకు ఇంకా తేదీని ఖరారు చేయలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజే 1,733 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.