ETV Bharat / bharat

కూతురి పుట్టినరోజుకు కానుకగా జాబిల్లిపై స్థలం

author img

By

Published : Mar 22, 2021, 8:27 AM IST

Man bought an acre land in moon to present daughter on her birthday
కూతురి పుట్టినరోజుకు చంద్రునిపై ఒక ఎకరం కానుకగా..

కొడుకు లేదా కూతురు పుట్టినరోజున వినూత్న బహుమతులిచ్చి వారిని సంతోష పెడుతుంటారు చాలామంది తల్లిదండ్రులు. అదే కోవకు చెందిన ఓ వ్యక్తి ఎకరం స్థలం కొనేసి, కూతురికి ఇచ్చాడు. అదీ ఏకంగా చంద్రునిపై.! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఎవరా వ్యక్తి? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

భూమిపై స్థలాలు కొనడం మానేసి.. ఏకంగా చంద్రుడిపైనే తిష్ట వేసేందుకు చూస్తోంది నేటి తరం. అదే ఆలోచన వచ్చిన ఒడిశాకు చెందిన అభయ్​ సేనాపతి.. తన కూతురి జన్మదినం సందర్భంగా చంద్రునిపై ఎకరం స్థలం కొని, కానుకగా ఇచ్చాడు.

Man bought an acre land in moon to present daughter on her birthday
అభయ్​ కుటుంబం

కేంద్రపాడా జిల్లాలోని పట్టముండాయి ప్రాంతానికి చెందిన అభయ్​.. జనవరి 15న తన కుమార్తె పుట్టిన రోజున వినూత్న బహుమతి ఇవ్వాలనుకున్నాడు. రూ.10వేలు చెల్లించి.. చంద్రునిపై ఎకరం స్థలం కొనుగోలు చేశాడు.

Man bought an acre land in moon to present daughter on her birthday
చంద్రునిపై పై స్థల రిజిస్ట్రేషన్​ డాక్యుమెంట్

అభయ్​.. అమెరికాకు చెందిన ఓ కంపెనీలో పనిచేస్తూ.. బెంగళూరులో నివాసముంటున్నాడు. యూఎస్​లోని తన బంధువు సాయంతో.. చంద్రునిపై స్థలం కొనుగోలు చేసేందుకు ప్రణాళిక వేశాడు. జనవరిలోనే స్థలాన్ని బుక్​ చేసుకుని, ఫిబ్రవరిలో దాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇదీ చదవండి: పెళ్లిరోజు కానుకగా చంద్రునిపై మూడెకరాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.