ETV Bharat / bharat

మహిళా నేతపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక దాడి!

author img

By

Published : Apr 3, 2021, 6:47 PM IST

Man arrested for raping minor girl on Holi in UP's Aligarh
తండ్రి పనిచేసే చోట మైనర్​ బాలికపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో దళిత బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి పనిచేసే ఇటుక బట్టీ యజమానికి దగ్గరి బంధువే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు వివరించారు. మరోవైపు, మధ్యప్రదేశ్​ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు.. తనపై లైంగిక దాడి చేశాడని ఓ మహిళా నేత ఆరోపించారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని అలీఘడ్​లో దళిత బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక తండ్రి పనిచేసే ఇటుక బట్టీ యజమానికి దగ్గరి బంధువైన నిందితుడు.. హోలీ రోజు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

హోలీ రోజు బాలికను ఇటుక బట్టీ ప్రాంగణంలోని కార్యాలయానికి పిలిచి నిందితుడు అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇటుక బట్టీ యజమానిని ప్రశ్నించగా వారు అతనిపై దాడి చేశారని, పోలీసులకు చెప్పొద్దని బెదిరించారని అన్నారు. దీంతో బాలిక తండ్రి కార్మిక నాయకులను సంప్రదించగా.. అతను ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. మథురకు చెందిన నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న అతన్ని శనివారం అరెస్టు చేసినట్లు సీనియర్ ఎస్పీ కళానిధి నైతాని స్పష్టం చేశారు.

మహిళా నేతపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక దాడి!

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు తనను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యూత్ కాంగ్రెస్ మహిళా నేత ఆరోపించారు. దీంతో ఆయనపై ఇందోర్​లోని మహిళా పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు.

"చాలా కాలంగా ఆ మహిళ నా కుమారుడి నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పటికైనా ఆమె తనపై అత్యాచారం కేసు పెడుతుందని నా కొడుకు భయపడ్డాడు కూడా. దీనిపై గురువారమే ఇందోర్​ డీఐజీకి లేఖ రాశా."

-కాంగ్రెస్​ ఎమ్మెల్యే

సదరు మహిళపై ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజానిజాలను బట్టి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

మరోవైపు, సున్నితమైన ఈ అంశంపై అంతర్గత విచారణ జరపనున్నట్లు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రాంత్ భూరియా తెలిపారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇవీ చదవండి: విషం తాగి అత్యాచార బాధితురాలు మృతి

చిత్రహింసలు పెట్టి వితంతువుపై హత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.