ETV Bharat / bharat

ఖోఖో నేషనల్ ప్లేయర్​పై అత్యాచారం-​ ప్రతిఘటించిందని హత్య

author img

By

Published : Sep 15, 2021, 11:20 AM IST

24 ఏళ్ల జాతీయ స్థాయి ఖోఖో క్రీడాకారిణిపై అత్యాచారయత్నం, హత్య కేసును 3 రోజుల్లోనే ఛేదించారు పోలీసులు. నిందితుడిని అరెస్టు చేశారు. మరోచోట.. అడిగినంత కట్నం తేలేదని అత్తింటివారే కోడలికి విషమిచ్చి చంపారు. ఈ రెండు ఘటనలు ఉత్తర్​ప్రదేశ్​లో జరిగాయి.

Man arrested for Kho Kho player's murder in UP
ఉత్తర్​ప్రదేశ్​, అత్యాచారం, హత్య, ఖోఖో ప్లేయర్​

ఉత్తర్​ప్రదేశ్​లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. బిజ్​నోర్​ రైల్వే స్టేషన్​లో.. జాతీయ స్థాయి ఖో-ఖో క్రీడాకారిణిపై అత్యాచారం విఫలం కాగా.. ఆమెను హత్య చేశాడో దుండగుడు. బాధితురాలి ఫోన్​ను ట్రేస్​ చేసి.. నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు.

ఇదీ జరిగింది..

సెప్టెంబర్​ 10, మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. ఓ ఇంటర్వ్యూకు హాజరై ఇంటికి తిరిగివెళ్తోంది 24 ఏళ్ల యువతి. ఆమె ఒంటరిగా ఉండటం గమనించిన రైల్వే కూలీ షెహజాద్​ ఖాదిమ్ అత్యాచారం చేయబోయాడు. ఆ సమయంలో తన స్నేహితురాలితో ఫోన్​లో మాట్లాడుతున్న బాధితురాలు.. సహాయం చేయాలని గట్టిగా అరుస్తూ ఆ వ్యక్తిని ప్రతిఘటించింది. కోపోద్రిక్తుడైన అతడు.. దుపట్టా, తాడు సహాయంతో ఆమెను హత్య చేశాడు.

చనిపోయిన మహిళ ఫోన్​ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని చూసి స్థానికులు.. ఆమె కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఫోన్​ ఆధారంగా..

బాధితురాలి ఫోన్​ను ట్రేస్​ చేసిన పోలీసులు.. ఈ మంగళవారం అతడి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. అతడి చొక్కా రక్తంతో ఉండటాన్ని గుర్తించారు. ఇంకా.. ఘటనా స్థలంలో నిందితుడి చెప్పులు, చొక్కా గుండీలు దొరికాయి.

ఖాదిమ్​కు.. ఇప్పటికే పెళ్లై ఓ కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు మాదక ద్రవ్యాలకు బానిస అని, స్థానిక పోలీసు స్టేషన్​లో నిందితుడిపై​ నాలుగు దొంగతనం కేసులున్నాయని పేర్కొన్నారు.

3 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసు బృందానికి రూ. 25 వేల రివార్డు ప్రకటించారు ఎస్​పీ​ ధరంవీర్​ సింగ్​. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్​ కోరనున్నట్లు తెలిపారు.

కట్నం తేలేదని విషం ఇచ్చి..

అడిగినంత కట్నం తీసుకురాలేదని.. ఓ మహిళకు విషం ఇచ్చి హత్య చేసిన మరో ఘటన ఉత్తర్​ప్రదేశ్​ షామ్లీ జిల్లాలో జరిగింది. అజాద్​ చౌక్​కు చెందిన ముస్కాన్​కు.. మే నెలలో ఖాసిఫ్​తో పెళ్లయింది. అప్పటినుంచి.. తరచూ తమ కూతుర్ని కట్నం కోసం వేధించేవాడని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే.. హత్య చేశారని ఆరోపించారు.

బాధితురాలి భర్త, అత్త సహా మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం.. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యాచార ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. పాఠాలు చెప్పి పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముజఫర్​నగర్​ జిల్లా పుర్కాజీ ప్రాంతంలో సెప్టెంబర్​ 14న జరిగింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఏడాదిన్నర పసికందు హత్యాచారానికి గురైన పాశవిక ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బహ్రాయిచ్​ జిల్లాలో 2 నెలల కిందట వెలుగుచూసింది. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.