ETV Bharat / bharat

'కొవిడ్​ కొత్త కేసుల్లో టీకా తీసుకున్నవారే అధికం'

author img

By

Published : Oct 26, 2021, 7:07 AM IST

తమ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల్లో.. టీకా రెండు డోసులు పూర్తి చేసుకున్న వారే అధికంగా ఉంటున్నారని తెలిపారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(mamata banerjee news). రోగనిరోధక శక్తి ఆరు నెలలు మించడం లేదని వెల్లడించారు(west bengal covid cases graph).

west bengal covid cases today
బంగాల్​లో కొవిడ్​ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడిన తరుణంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(mamata banerjee news ) చేసిన వ్యాఖ్యలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తమ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల్లో అధిక భాగం టీకా రెండు డోసులు తీసుకున్న వారే ఉంటున్నారని వ్యాఖ్యానించారు(west bengal covid cases graph). పూర్తి వ్యాక్సినేషన్​ అయినప్పటికీ రోగనిరోధక శక్తి ఆరు నెలలకు మించి ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. ఇందుకు గల కారణాలు అన్వేషించే బాధ్యతను రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శికి అప్పగించారు.

"టీకాలు తీసుకున్న తర్వాత కోవిడ్​ బారిన పడుతున్న రోగులు మరణించకపోవచ్చు. కానీ అసలు వారిలో రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గుతోంది? ఇలా చాలా కేసులు బయటపడ్డాయి. రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికే వైరస్​ సోకుతోంది. రిపోర్టులు ఇదే చెబుతున్నాయి. టీకా తీసుకున్న తర్వాత రోగనిరోధక శక్తి ఆరు నెలలు కూడా ఉండకపోవడమే ఇందుకు కారణం. దీని గురించి బయట మాట్లాకపోయినా, ఇదే నిజం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆరోగ్య కార్యదర్శి ఎన్​.ఎస్​ నిగమ్​కు ఆదేశాలిచ్చాను. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలని అన్నాను. దీనిపై కేంద్రం అధ్యయనం చేస్తోందా? అని ప్రశ్నించమన్నాను."

--మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం.

నవరాత్రి ఉత్సవాల అనంతరం బంగాల్​లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నెల 20,21,22,23 రోజుల్లో వరుసగా 867, 833, 846, 974 కేసులు వెలుగులోకి వచ్చాయి. సోమవారం మరో 805 కేసులు బయటపడ్డాయి(west bengal covid cases today). దీంతో అక్టోబర్​ 15 నాటికి 15,79,463గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య.. కొన్ని రోజులకే 15,87,260కు చేరింది. మరణాలు 19,066గా ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

కేరళలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారంతో పోల్చితే కొత్త కేసులు(kerala cases today) భారీగా తగ్గాయి. కొత్తగా 6,664 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. అయితే.. మరణాలు(Covid-19 deaths) మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే 281 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 49,12,789, మరణాలు 28,873కు చేరాయి.

సోమవారం మొత్తం 9,010 మంది వైరస్(Corona virus)​ నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 74,735కు దిగొచ్చింది. సోమవారం మొత్తం 14 జిల్లాల్లో 61,202 మందికి పరీక్షలు నిర్వహించారు.

  • కర్ణాటకలో కొత్తగా 290 పాజిటివ్​ కేసులు రాగా.. 10 మంది మరణించారు.
  • మిజోరాంలో 158 మంది వైరస్​ బారినపడ్డారు. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
  • దేశవ్యాప్తంగా 1.02 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.