ETV Bharat / bharat

హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. మమతకు గాయాలు.. తప్పిన ప్రమాదం

author img

By

Published : Jun 27, 2023, 5:29 PM IST

Updated : Jun 27, 2023, 6:35 PM IST

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్నహెలికాప్టర్​ను అత్యవసరంగా ల్యాండ్ ​చేస్తున్న సమయంలో ఆమెకు గాయాలయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల హెలికాప్టర్​ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

Mamata Banerjee helicopter
బంగాల్ సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయాలతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర కుదుపులకు లోనుకాగా.. మమత నడుముకు, కాళ్లకు గాయాలయ్యాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్​ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ముప్పు తప్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోల్​కతాలోని ఓ ఆస్పత్రి వైద్యులు మమతకు చికిత్స చేశారు.

  • #WATCH | West Bengal CM Mamata Banerjee arrived at SSKM Hospital in Kolkata this evening.

    Earlier today, her helicopter made an emergency landing at Sevoke Airbase due to low visibility. She was going to Bagdogra after addressing a public gathering at Krinti, Jalpaiguri. pic.twitter.com/HCt7vzsTM4

    — ANI (@ANI) June 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రచారం ముగించుకుని వస్తూ..
బంగాల్​లో జులై 8న జరగనున్న పంచాయితీ ఎన్నికల కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు మమతా బెనర్జీ. రెండు రోజులుగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రచారం ముగించుకుని కోల్​కతాకు తిరిగి వద్దామని బయలుదేరారు. బాగ్​డోగ్రా విమానాశ్రయం నుంచి రాజధానికి విమానంలో వెళ్లాలని అనుకున్నారు. ఇందుకోసం జల్పాయ్​గుడి నుంచి బాగ్​డోగ్రా విమానాశ్రయానికి మంగళవారం మధ్యాహ్నం హెలికాప్టర్​లో బయలుదేరారు. అయితే.. మమత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బైకుంఠ్​పుర్ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షంలో చిక్కుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ మొత్తం ఊగిపోయింది. అందులో ఉన్న సీఎం గాయపడ్డారు. ఆమెతోపాటు ఉన్న అధికారులు, ఇతర సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. క్లిష్ట సమయంలో పైలట్​ అప్రమత్తంగా వ్యవహరించారు. సిలిగుడి సమీపంలోని సివోక్ ఎయిర్​బేస్​లో హెలికాప్టర్​ను అత్యవసరంగా దించారు. ముఖ్యమంత్రికి పెను ప్రమాదం తప్పినందున అధికారులు, టీఎంసీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు.

Mamata Banerjee helicopter
హెలికాప్టర్​ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న పైలట్

సివోక్ ఎయిర్​బేస్​ నుంచి మమత రోడ్డు మార్గంలో బాగ్​డోగ్రా విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో కోల్​కతాకు చేరుకున్నారు. వెంటనే నగరంలోని ఎస్​ఎస్​కేఎం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మమతకు చికిత్స చేశారు.
మమత గాయపడ్డారని తెలుసుకుని బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆమెకు ఫోన్ చేశారు. క్షేమసమాచారం అడిగి తెలుసుకున్నారు.

బీజేపీకి మరో 6 నెలలే..
అంతకుముందు.. కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. కేంద్రంలో బీజేపీ మరో 6 నెలలే అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. జల్పాయ్​గుడి జిల్లాలో నిర్వహించిన ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు మమత. ఓటమి భయంతో బీజేపీ నేతలు వేర్వేరు వర్గాలను మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

"వాళ్లు(బీజేపీ నేతలు) ఇప్పుడు ముస్లింలతో ఉన్న ఫొటోలు షేర్ చేస్తున్నారు. ముస్లింలను ఎంత బాగా చూసుకుంటామో చెప్పేందుకు యత్నిస్తున్నారు. వారిలో(బీజేపీ నేతలతో ఉన్న ముస్లింలలో) ఎక్కువ మంది వ్యాపారులే. పేదలు, అణగారిన వ్యక్తుల గురించి వారికి పట్టదు. వారినే బీజేపీ వాడుకుంటోంది. దీదీ ఉన్నంత కాలం మైనారిటీలు సురక్షితంగా ఉంటారు" అని అన్నారు మమతా బెనర్జీ.

Last Updated :Jun 27, 2023, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.