ETV Bharat / bharat

మహారాష్ట్రలో భాజపాకే కీలక శాఖలు, హోం, ఆర్థిక మంత్రిగా ఫడణవీస్

author img

By

Published : Aug 14, 2022, 7:39 PM IST

maharashtra cabinet expansion
మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

MAHARASHTRA CABINET EXPANSION మహారాష్ట్రలో మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే శాఖలను కేటాయించారు. భాజపా నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు హోం, ఆర్థిక శాఖలు దక్కాయి.

MAHARASHTRA CABINET EXPANSION: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం ఏక్​నాథ్ శిందే పట్టణాభివృద్ధి, రవాణా, మార్కెటింగ్, మైనారిటీ శాఖతో సహా 11 శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. భాజపా నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​కు కీలకమైన హోం శాఖ, ఆర్థిక శాఖను అప్పగించారు. వీటితో పాటు న్యాయ శాఖ, నీటి పారుదల శాఖను ఫడణవీస్​కు కేటాయించారు. మరోవైపు భాజపా సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్​కు విద్యా, జౌళి శాఖ మంత్రిగా అవకాశం దక్కింది.

భాజపాకు చెందిన రాధాకృష్ణ విఖె పాటిల్ రెవెన్యూ శాఖ కేటాయించారు. భాజపా నేత సుధీర్ ముంగటివార్​కు అటవీశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. శివసేన నేత అబ్దుల్ సత్తార్​కు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే. తానాజీ సావంత్​కు ఆరోగ్యశాఖ దక్కింది. మంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయగా.. ఆదివారం వీరందరికి శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే.

అవసరమైతే తదుపరి మంత్రివర్గ విస్తరణకు ముందు భాజపా, శివసేన కొన్ని శాఖలను మార్చుకోవచ్చని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో భాజపా, ఏక్​నాథ్ శిందే మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని తెలిపారు ఫడణవీస్.
మంగళవారం మహారాష్ట్ర కేబినెట్ మంత్రులుగా 18 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 9 మంది భాజపా ఎమ్మెల్యేలు, మరో 9 మంది శివసేన శాసనసభ్యులు ఉన్నారు.

ఇవీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబు, వరుసగా 9వ సారి మోదీ జెండావందనం

పెళ్లికి వెళ్తూ ఆరుగురు మృతి, ఐదుగురు ఒక కుటుంబానికి చెందినవారే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.