విగ్రహం కోసం వందల మంది ఘర్షణ.. అడ్డొచ్చిన పోలీసులపైనా!

author img

By

Published : May 14, 2022, 7:50 AM IST

Villagers clash over Shivaji statue

Villagers clash over Shivaji statue: రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదంలో 300 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులపై రాళ్లు రువ్విన 34 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

Villagers clash over Shivaji statue: మహారాష్ట్ర జల్నా జిల్లాలో రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్​ విగ్రహ తొలగింపు, గ్రామ పేరు మార్పు విషయంలో తలెత్తిన వివాదమే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న 300 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. అదనపు బలగాలను మోహరించినట్లు ఎస్పీ హర్ష్​ పొద్దర్​ తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ జరిగింది: జల్నా సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న పోరాటయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్ర​హాన్ని అధికారులు తొలగిస్తున్నారు. దీంతో పాటు గ్రామానికి మాజీ భాజపా నాయకుడు గోపీనాథ్​ ముండే పేరును పెట్టింది. దీన్ని ఓ వర్గం అడ్డుకోవడం వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులపైకి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 30 మంది పోలీసులకు స్వల్ప గాయాలుకాగా.. మూడు పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడం వల్ల పోలీసులు టియర్​ గ్యాస్​ ప్రయోగించారు.

ఇదీ చదవండి: గొడ్డలితో నరికి మేనమామ హత్య... తలతో ఊరంతా తిరిగి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.