ETV Bharat / bharat

మహారాష్ట్రలో రేపటి నుంచి సినిమా హాళ్లు ఓపెన్​

author img

By

Published : Nov 4, 2020, 6:19 PM IST

మహారాష్ట్ర లాక్​డౌన్ నిబంధనలు సడలించింది. నవంబరు 5 నుంచి సినిమా థియేటర్లు, ఈత కొలనులు, యోగా కేంద్రాలు తెరవడం సహా మరికొన్నింటికి అనుమతిచ్చింది.

Maha: Theaters, swimming pools, yoga centres can reopen from tomorrow
మహాలో రేపటి నుంచి సినిమా హాళ్లు ఓపెన్​

మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో లాక్​డౌన్​ మార్గదర్శకాలను సడలించింది రాష్ట్ర ప్రభుత్వం. గత నెలలో హోటళ్లు, బార్లు తెరవడానికి అనుమతిచ్చిన ప్రభుత్వం.. గురువారం (నవంబరు 5) నుంచి సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్​లు, ఈత కొలనులు, యోగా కేంద్రాలను తెరిచేందుకు సమ్మతి తెలిపింది.

50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్​లు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆహార పదార్థాలకు లోపలికి అనుమతిలేదు.

ఈత కొలనుల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకే అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది మహా ప్రభుత్వం. యోగా సంస్థలు, బ్యాడ్మింటన్​ హాల్స్​, టెన్నిస్​, క్వాష్​ కోర్టు, ఇండోర్​ షూటింగ్​ రేంజ్​ వంటి ఇండోర్​ క్రీడలు నిర్వహించుకోవచ్చు.

అయితే భౌతిక దూరం, శానిటైజేషన్​ వంటి కరోనా నిబంధనలు తప్పక పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

నవంబరు 30 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది మహా ప్రభుత్వం.

ఇదీ చూడండ: అత్యాధునిక 'పినాక' రాకెట్​ ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.