ETV Bharat / bharat

ఏడాదంతా పోలీస్ స్టేషన్​లోనే వినాయకుడు.. దర్శనానికి 10రోజులే ఛాన్స్

author img

By

Published : Sep 3, 2022, 2:31 PM IST

దేశంలో ఎక్కడైనా వినాయకుడి విగ్రహాన్ని.. అందంగా అలంకరించిన మండపాలలో పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ బిహార్​లోని నలందలో మాత్రం వినాయకుడిని పోలీస్ స్టేషన్​లో ఉంచుతున్నారు. సంవత్సరంలో పది రోజులు మాత్రమే బయటకు తీసుకొస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో ఓ సారి తెలుసుకుందామా.

lord ganesha idol in police
గణేశ్ చతుర్థి

దేశవ్యాప్తంగా గణేశ్​ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్యకు భక్తులు పూజలు చేస్తూ తరిస్తున్నారు. తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత గజాననుడిని నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే బిహార్​ నలందలోని ఓ వినాయకుడు మాత్రం ఏడాదిలో 355 రోజులు పోలీస్ స్టేషన్​లోనే ఉంటాడు. 10 రోజులు మాత్రమే భక్తులకు కనిపిస్తాడు. ఈ పది రోజులు భక్తులు వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తారు. ఎందుకు ఇంతలా ఈ విగ్రహానికి భద్రత కల్పిస్తున్నారు? ఈ విగ్రహంలో ఏముందని ఆలయ పూజారి గోవింద్ రామ్​ను ఆరా తీయగా.. అసలు విషయాలు చెప్పారు.

ఈ గణేశ్ విగ్రహం 150 ఏళ్ల పురాతనమైనదని పూజారి గోవింద్ రామ్ తెలిపారు. అందుకే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పాలరాయితో తయారు చేసిన ఈ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని.. దొంగల కంట పడకుండా ఉంచేందుకే ఇలా చేస్తున్నట్లు వివరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మందిరంలో వినాయకుడిని ఉంచుతున్నట్లు చెప్పారు.

lord ganesha idol in police station
పోలీస్ స్టేషన్​ ఆవరణలో గణేశుడు
lord ganesha idol in police station
పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయం

"ఈ విగ్రహాన్ని పాలరాతితో తయాారు చేశారు. కొన్నాళ్ల క్రితం పూజల కోసం బయటకు తెచ్చారు. కానీ విగ్రహాన్ని దొంగిలించేందుకు దొంగలు పలుమార్లు ప్రయత్నించారు. ఓ సారి ఎత్తుకెళ్లిపోయారు. స్థానికులు వారిని పట్టుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకే విగ్రహాన్ని భద్రత కోసం సిలావ్ పోలీస్ స్టేషన్​ ఆవరణలోని దేవాలయంలో ఉంచుతాం. వినాయక చవితి సమయంలో 10 రోజులు బయటకు తెచ్చి ఘనంగా వేడుకలు నిర్వహిస్తాం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలోని దేవాలయంలో విగ్రహాన్ని పెట్టేస్తాం."
--బాల గోవింద్ రామ్, ఆలయ పూజారి

ఇవీ చదవండి: కడియాల కోసం దారుణం.. వృద్ధురాలి కాలు నరికి పరార్.. స్కూల్లో దళితులపై కులవివక్ష

'భారత జాతీయ భాషగా సంస్కృతం'.. సుప్రీంకోర్టు ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.