ETV Bharat / bharat

Live In Relationship : 'సీజన్‌కో పార్ట్​నర్​తో.. సహజీవనంతో వివాహ వ్యవస్థ ధ్వంసం'.. లివ్ ఇన్​ రిలేషన్​షిప్స్​పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 9:19 AM IST

Live In Relationship Allahabad High Court
Live In Relationship Allahabad High Court

Live In Relationship Allahabad High Court : వివాహ వ్యవస్థ అందించే సామాజిక భద్రత సహజీవన సంబంధాలు ఇవ్వలేవని అలహాబాద్‌ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రతి సీజన్‌లో భాగస్వామిని మార్చే ఈ క్రూరమైన భావన ఒక స్థిరమైన, ఆరోగ్యవంతమైన సమాజానికి లక్షణంగా పరిగణించలేమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Live In Relationship Allahabad High Court : భారత్‌లోని వివాహ వ్యవస్థను ధ్వంసం చేసేలా సహజీవన వ్యవస్థ పని చేస్తోందని అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సహజీవన సంబంధాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సహజీవన భాగస్వామికి బెయిల్ మంజూరు చేసిన కేసులో హైకోర్టు వ్యాఖ్యానించింది.

కేసు ఏంటంటే?
Live In Relationship Allahabad HC : ఏడాది పాటు సహజీవనం చేస్తున్న ఓ యువకుడు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన 19 ఏళ్ల యువతి కేసు పెట్టింది. తాను గర్భవతినని, తన భాగస్వామి పెళ్లికి అంగీకరించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. యువతి కేసుపై శుక్రవారం విచారణ జరిపిన అలహాబాద్​ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సిద్ధార్థ్​.. నిందితుడికి బెయిల్‌ మంజూరు చేశారు. దాంతో పాటు సహజీవన సంబంధాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ అందించే సామాజిక భద్రత, అంగీకారం, స్థిరత్వం.. ఈ సహజీవన సంబంధాలు అందించవు. ప్రతి సీజన్‌లో భాగస్వామిని మార్చే ఈ క్రూరమైన భావన ఒక స్థిరమైన, ఆరోగ్యవంతమైన సమాజానికి లక్షణంగా పరిగణించలేం. వివాహ వ్యవస్థ కనుమరుగైన తర్వాతే మన దగ్గర ఈ బంధం సాధారణమవుతుంది. వివాహ వ్యవస్థలో భాగస్వామితో నిజాయతీగా లేకపోవడం, సహజీవన సంబంధాలను కలిగి ఉండటం ప్రగతిశీల సమాజానికి సూచనలుగా చెలామణి అవుతున్నాయి. అలాంటి ధోరణికి యువత ఆకర్షితులు కావడం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ తీరుతో దీర్ఘకాలంలో జరిగిన పరిణామాల పట్ల అవగాహన లేకపోవడమే అందుకు కారణం."

- సహజీవన సంబంధాలపై అలహాబాద్‌ హైకోర్టు

బెయిల్​కు షరతులు వర్తిస్తాయి!
Allahabad High Court On Live In Relationship : అయితే నిందితుడికి బెయిల్​ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి పలు షరతులను విధించారు. కేసులో సాక్ష్యాలను తారుమారు చేయకూడదని తెలిపారు. విచారణలో నిజాయితీగా సహకరించాలని, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. వీటిలో ఏమైనా ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందమని పేర్కొన్నారు.

'18 ఏళ్లలోపు వారి సహజీవనం చట్ట విరుద్ధం'
కొన్ని రోజుల క్రితం.. 18ఏళ్లలోపువారు సహజీవనం చేయడం చట్టవిరుద్ధం, అనైతికమని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. 18ఏళ్లలోపు ఉన్న అబ్బాయి.. వయసులో తనకంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కావని జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ బిర్లా, జస్టిస్‌ రాజేంద్రకుమార్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసలు ఆ కేసు ఏంటో తెలుసుకోవాలనుకుంటే లింక్​పై క్లిక్​ చేయండి.

'సహజీవనం రిజిస్ట్రేషన్​ తప్పనిసరి!'.. సుప్రీంకోర్ట్ సీరియస్ కామెంట్స్

'మైనర్లు సహజీవనం చేయడం అనైతికం, చట్టవిరుద్ధం- నేర విచారణ నుంచి రక్షణ ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.