ETV Bharat / bharat

'గల్వాన్​లో బుద్ధి చెప్పాం.. ఇంకా సహనాన్ని పరీక్షించొద్దు'

author img

By

Published : Jan 15, 2021, 12:39 PM IST

Army
గల్వాన్​లో బుద్ధి చెప్పాం

ఆర్మీ దినోత్సవం సందర్భంగా దిల్లీ కరియప్ప మైదానంలో జరిగిన పరేడ్​లో సైన్యాధిపతి ఎమ్​ఎమ్​ నరవాణే పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా సహా పాకిస్థాన్​ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన చైనాకు భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చిందని సైన్యాధిపతి ఎమ్​ఎమ్​ నరవాణే అన్నారు. సైన్యం చేతిలో దేశం సురక్షితంగా, భద్రంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా దిల్లీ కరియప్ప మైదానంలో జరిగిన పరేడ్​లో ఆయన పాల్గొన్నారు.

Army
సైనికుల పరేడ్
Army
సైనికుల కవాతు
Army
సైన్యాధిపతి నరవాణే

"సరిహద్దులో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన గురించి అందరికీ తెలుసు. సరిహద్దు వద్ద యుథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన చైనా తగిన మూల్యం చెల్లించుకుంది. గల్వాన్​ అమరవీరుల త్యాగాన్ని వృథా కానివ్వబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను.

సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అలా అని మా సహనాన్ని పరీక్షించే తప్పు చేయొద్దు.

భారత్​లోకి చొరబడేందుకు పాకిస్థాన్​ సరిహద్దు వద్ద 300-400 మంది ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే కాల్పుల విరమణ ఘటనలు 44 శాతం పెరిగాయి. దీన్ని బట్టి పాకిస్థాన్​ కుటిల బుద్ధి అర్థం అవుతోంది. గత ఏడాది నియంత్రణ రేఖ వద్ద 200 మందికి పైగా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది."

- ఎమ్​ఎమ్​ నరవాణే, భారత సైన్యాధిపతి

ఆధునీకరణ..

సైన్యాన్ని ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నట్లు నరవాణే అన్నారు. ఇందుకోసం అత్యవసరంగా రూ. 5 వేల కోట్లు విలువైన ఆయుధాల కోసం ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. గత ఏడాది రూ.13 వేల కోట్ల విలువైన పరికరాల కోసం సంతకాలు చేశామని సైన్యాధిపతి అన్నారు.

ఆర్మీ దినోత్సవం సందర్భంగా తొలిసారి కాంబాట్​ స్వార్మ్​ డ్రోన్లను ప్రదర్శన చేసింది సైన్యం. వీటితో పాటు పలు యుద్ధ ట్యాంకులు, ఆధునిక పరికరాలను పరేడ్​లో ఉంచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.