ETV Bharat / bharat

ఉక్రెయిన్ నుంచి భారత్​కు 15,900 మంది.. వారికి కీలక సూచనలు

author img

By

Published : Mar 6, 2022, 5:17 PM IST

Last leg of Operation Ganga: ఉక్రెయిన్ నుంచి ఆదివారం 2,135 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఇప్పటివరకు ఉక్రెయిన్​ నుంచి తరలించిన భారతీయుల సంఖ్య 15,900కు చేరిందని పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇంకా ఉక్రెయిన్​లోనే ఉన్న భారతీయులు అత్యవసరంగా గూగుల్‌ ఫారాన్ని నింపాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది.

Ukraine russia war
ఉక్రెయిన్​

Last leg of Operation Ganga: ఉక్రెయిన్ నుంచి ఆదివారం 2,135 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఇప్పటివరకు ఉక్రెయిన్​ నుంచి తరలించిన భారతీయుల సంఖ్య 15,900కు చేరిందని పౌర విమానయాన శాఖ తెలిపింది. సోమవారం మరో ఎనిమిది విమానాల్లో భారతీయులను తరలించనున్నారు. బుడాపెస్ట్ నుంచి 5 విమానాలు, సుసెవా నుంచి రెండు విమానాలు బుకారెస్ట్ నుంచి ఒక విమానంతో 1500 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు.

మరోవైపు, ఉక్రెయిన్‌లో ఉన్న మిగిలిన భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. వారంతా అత్యవసర ప్రాతిపాదికన గూగుల్‌ ఫారాన్ని నింపాలని సూచించింది. పేరు, ఫోన్‌ నంబర్‌, ప్రస్తుతం తాము ఉంటున్న ప్రాంతం చిరునామా సహా ఫారంలో సూచించిన వివరాలను అందజేయాలని స్పష్టం చేసింది.

అటు, హంగరీలోని భారత దౌత్య కార్యాలయం మరో ప్రకటన విడుదల చేసింది. భారతీయులను రప్పించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ గంగా కార్యక్రమంలో చివరి విడత విమాన రాకపోకలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులు పొరుగున ఉన్న హంగరీ సరిహద్దులకు రావాలని సూచించింది. హంగరియా సిటీ సెంటర్‌, రకోజీ, బుడాపెస్ట్‌కు రావాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'భారత్ శక్తిమంతంగా మారుతున్నందునే ఆపరేషన్ గంగా సక్సెస్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.