ETV Bharat / bharat

కేరళ కవలల లేఖకు బ్రిటన్​ రాణి ఫిదా!

author img

By

Published : May 3, 2021, 8:47 AM IST

మార్చి నెలలో ఎలిజబెత్​ రాణికి లేఖ రాశారు కేరళకు చెందిన కవలలు. తాజాగా రాణి నుంచి వారికి లేఖ అందింది. అది చూసి ఆ కవలలు తెగ సంబరపడిపోతున్నారు.

Kerala twin sisters get a letter from British Queen Elizabeth
కేరళ కవలల లేఖకు బ్రిటన్​ రాణి ఫిదా!

కేరళలోని కవలలు.. ఇటీవలే బ్రిటన్​ రాణి ఎలిజబెత్​కు లేఖ రాశారు. కేరళ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. తాజాగా.. లండన్​ విన్డ్​సర్​ కాస్టిల్​ నుంచి వీరికి లేఖ వచ్చింది. రాణి నుంచి స్వయంగా లేఖ అందడం వల్ల వీరు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Kerala twin sisters get a letter from British Queen Elizabeth
కేరళ కవలల లేఖకు బ్రిటన్​ రాణి ఫిదా!

ఇదీ జరిగింది...

త్రిస్సూర్​ జిల్లాలోని కూర్కంచెరిలో నివాసముంటున్నారు అన్లిన్​-అన్లిత్​ అనే కవలలు. ఇరింగలక్కుడ క్రైస్ట్​ విద్యానికేతన్​ పాఠశాలలో 6వ తరగతి చదువుకుంటున్నారు. మార్చి 8వ తేదీన.. ఎలిజబెత్​కు ఉద్దేశించి బకింగ్హమ్​ ప్యాలెస్​కు వీరు ఓ లేఖ రాశారు. రాణిని కేరళ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. తాము లండన్​ సందర్శించాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. త్రిస్సూర్​, అలప్పుజ అందాలతో కూడిన పెయింటింగ్స్​ను లేఖతో పాటు పంపించారు ఈ కవలలు.

ఈ లేఖకు రాణి ఎలిజబెత్​ నుంచి సమాధానం వచ్చింది. దీంతో కవలలు ఆశ్చర్యానికి గురయ్యారు. 'లేఖను చాలా బాగా రాసినందుకు ధన్యవాదాలు' అంటు రాణి బదులిచ్చారు. అందమైన పెయింటింగ్స్​ను పంపింనందుకు మెచ్చుకున్నారు. కవలలు ఆనందగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు.

అన్లిన్​-అన్లిత్​ కవలలు తమ పెయింటింగ్స్​తో ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు. రాణి ఎలిజబెత్ నుంచి లేఖ రావడం వల్ల వారి తల్లిదండ్రులు సంతోష్​- మెఫ్లి సంబరపడిపోతున్నారు.

ఇదీ చూడండి:- బ్రిటన్​ నుంచి భారత్​కు మరో 1000 వెంటిలేటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.