ETV Bharat / bharat

Corona cases: కేరళలో కొత్తగా 26వేల కరోనా కేసులు

author img

By

Published : Sep 5, 2021, 10:46 PM IST

kerala corona cases
కేరళలో కొత్తగా 26వేల కేసులు.. తగ్గుతున్న ఉద్ధృతి!

కరోనా తీవ్రస్థాయిలో ఉన్న కేరళలో రెండోరోజు కేసులు(Corona cases) తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 26వేల మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి మరో 74 మంది మృతిచెందారు.

కరోనా వ్యాప్తి(Corona virus) ఆందోళనకర స్థాయిలో ఉన్న కేరళలో శనివారంతో పోలిస్తే కొవిడ్​ కేసులు(Corona cases) తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 26,071 మంది మహమ్మారి బారిన పడగా.. 28,900 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. 74 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 17.17 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 42,07,838కి చేరగా మహమ్మారి ధాటికి ఇప్పటివరకు 21,496 మంది మృతిచెందారు.

ఇతర రాష్ట్రాల్లో..

  • మహారాష్ట్రలో కూడా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. కొత్తగా 4,057 కేసులు బయటపడ్డాయి. 5,916 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 67 మంది మృతిచెందారు.
  • తమిళనాడులో కొత్తగా 1,592 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 1607 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 805 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఖుర్దా, కట్టక్​ జిల్లాల్లో నమోదయ్యాయి. వైరస్​ మరో ఏడుగురు బలయ్యారు.
  • బంగాల్​లో 707 కొత్త కేసులు బయటపడ్డాయి. 723 మంది కోలుకోగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొత్తగా 30 కేసులు నమోదు కాగా 333 మంది వైరస్​ను జయించారు. వరుసగా ఐదో రోజు కూడా మరణాలు నమోదు కాలేదు.

ఇదీ చదవండి : Vaccination: 'దేశంలో 50శాతానికిపైగా వయోజనులకు కొవిడ్​ టీకా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.