ETV Bharat / bharat

Nipah Virus: నిఫా వైరస్​ పరీక్షల్లో ఆ 30 మందికి నెగెటివ్

author img

By

Published : Sep 8, 2021, 11:49 AM IST

నిఫా వైరస్
నిఫా వైరస్

నిఫాతో మరణించిన 12 ఏళ్ల బాలుడితో సన్నిహితంగా ఉన్న 30 మందిలో వైరస్ ఆనవాళ్లు కనిపించలేదని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విస్తృత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటికే కరోనాతో విలవిలలాడుతున్న కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ (nipah virus kerala) మరణంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరణించిన బాలుడికి సన్నిహితంగా మెలిగిన 30 మందికి పరీక్షల్లో నెగెటివ్​గా తేలిందని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

"మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో 10 మందికి నెగెటివ్ రాగా.. మరో 21 మంది నమూనాలను పరీక్షల కోసం పంపగా నెగటివ్​గా తేలింది."

-వీణా జార్జ్, కేరళ ఆరోగ్య మంత్రి

'ప్రస్తుతం 68 మందిని పరిశీలనలో ఉంచామని.. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని' మంత్రి తెలిపారు. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ట్రేసింగ్​తో పాటు.. సమర్థ నిఘా, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

మరోవైపు వైరస్ మూలాల నిర్ధరణకు గబ్బిలాలు, ఇతర జంతువుల నమూనాలను సేకరించేందుకు భోపాల్​లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందం కేరళకు వచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.