ETV Bharat / bharat

కవర్​ ఆర్డర్​ చేస్తే ఒరిజినల్ పాస్​పోర్ట్​ డెలివరీ!

author img

By

Published : Nov 5, 2021, 3:28 PM IST

kerala man gets passport amazon
అమెజాన్

ఈ-కామర్స్ సైట్​ ద్వారా తన పాస్​పోర్ట్​కు కవరు కొనుగోలు చేశాడో వ్యక్తి. కొద్ది రోజుల్లోనే ఆర్డర్​ వచ్చింది. అయితే ఆ పార్సెల్​ను ఓపెన్​ చేసి చూసేసరికి విస్తుపోయాడు. అతను ఆర్డర్​ చేసిన కవర్​తో పాటు ఓ పాస్​పోర్ట్​ కూడా ఉండటమే కారణం. దీనిపై కస్టమర్​ సర్వీస్​ వాళ్లు ఇచ్చిన సమాధానికి అతనికి నోట మాటరాలేదు. ఇంతకీ అసలు ఏం జరిగింది?

ఈ-కామర్స్​ సైట్లలో ఆర్డర్​ చేసిన వస్తువుల స్థానంలో కస్టమర్లకు వేరే వస్తువులు అందుతున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇటీవల కేరళకు చెందిన ఓ వ్యక్తి రూ.70వేలు విలువ చేసే ఐఫోన్ 12​ను ఆర్డర్​ పెడితే అతడికి ఓ విమ్​ సబ్బు, రూ.5 నాణెం వచ్చాయి. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తికి కూడా ఈ-కామర్స్​ సైట్​ ద్వారా వింత అనుభవం ఎదురైంది. పాస్​పోర్ట్​ పెట్టుకునేందుకు ఓ కవర్​ కోసం ఆర్డర్​ పెడితే.. ఆ కవర్​తో పాటు ఓ పాస్​పోర్ట్​ కూడా వచ్చింది. వింతగా ఉంది కదూ.. ఈ ఘటన వయనాడ్​ జిల్లా కనియమ్​బెట్టాలో జరిగింది.

కవర్​లో పాస్​పోర్ట్​..

మిథున్​ బాబు గత నెల 30న అమెజాన్​లో ఓ పాస్​పోర్ట్​ కవర్​ను ఆర్డర్​ చేశాడు. ఈ నెల 1న అతడి ఆర్డర్​ డెలివరీ అయింది. పార్సెల్​ ఓపెన్​ చేసి చూస్తే అందులో మరో వ్యక్తికి చెందిన పాస్​పోర్ట్​ కూడా ఉంది. వెంటనే అతను కస్టమర్​ కేర్​కు కాల్​ చేశాడు. అయితే వారు ఇచ్చిన సమాధానంతో ఆశ్చర్యపోవడం మిథున్​ వంతైంది. ఈ తప్పిదం మరోసారి జరగదని.. విక్రయదారుడికి దీనిపై హెచ్చరిస్తామంటూ చెప్పి ఫోన్​ పెట్టేశారు.

దీంతో ఆ పాస్​పోర్ట్​ను సంబంధిత వ్యక్తికి చేరవేసేందుకు మిథున్​ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ పాస్​పోర్ట్​లోని వివరాల ప్రకారం అది త్రిస్సూర్​కు చెందిన మహ్మద్​ సాలిహ్​కు చెందినది. ​పాస్​పోర్ట్​లో ఫోన్​ నెంబర్​ వంటి వివరాలు లేకపోయినా మిథున్.. చివరకు​ సాలిహ్​ వివరాలు సేకరించి అతడిని సంప్రదించాడు. త్వరలోనే అతనికి పాస్​పోర్ట్​ అందించనున్నాడు.

పాస్​పోర్ట్​ అలా వచ్చింది..

తన కంటే ముందుగా ఆ కవర్​ను సాలిహ్​ ఆర్డర్​ చేసి ఉంటాడని.. అందులో తన పాస్​పోర్ట్​ పెట్టి సరిచూసుకొని అది ​ నచ్చకపోవడం వల్ల దానిని రిటర్న్​ చేశాడని మిథున్​ పేర్కొన్నాడు. రిటర్న్​ చేస్తున్న క్రమంలో ఆ కవర్​లో నుంచి తన పాస్​పోర్ట్​ తీయడం మర్చిపోయి ఉండొచ్చని తెలిపాడు. రిటర్న్​ అయిన ఆ కవర్​ను సరిగ్గా పరిశీలించకుండా ఆ విక్రయదారుడు మరో ఆర్డర్​ వస్తే అమ్మేశాడని చెప్పాడు.

ఇదీ చూడండి : 'గంగిరెద్దుకు క్యూఆర్​ కోడ్​.. ఇదీ డిజిటల్​ విప్లవం అంటే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.