ETV Bharat / bharat

కత్తితో దుండగుడి దాడి.. ఎస్సై వీరోచిత పోరు.. వీడియో వైరల్​

author img

By

Published : Jun 20, 2022, 7:06 AM IST

kerala police viral video: కేరళలో ఓ పోలీసు అధికారి వీరోచితంగా పోరాడిన వైనం అందరిచేత ప్రశంసలందుకుంటోంది. ఓ దుండగుడు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసు అధికారి అడ్డుకున్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

kerala police video
kerala police video

kerala police viral video: కత్తితో దాడి చేసేందుకు యత్నించిన దుండగుడితో ఓ పోలీసు అధికారి వీరోచితంగా పోరాడిన వైనం ప్రశంసలందుకుంటోంది. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసు ఉన్నతాధికారి స్వాతి లక్రా ట్విటర్‌లో పంచుకోగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అలప్పుజ జిల్లా కాయంకులమ్‌లోని పారా జంక్షన్‌ వద్ద పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి ముందు జీపు ఆపి ఎస్సై కిందకు దిగగానే అప్రమత్తమైన దుండగుడు సుగతన్‌ తన వద్ద ఉన్న భారీ కత్తితో ఎస్సైపై దాడికి పాల్పడ్డాడు. అయితే దుండగుడి దాడి నుంచి తప్పించుకుంటూ, ప్రాణాలను లెక్కచేయకుండా ఎస్సై అతడిని నిలువరించాడు. పెనుగులాటలో ఇద్దరూ కిందపడిపోగా.. దుండగుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సుగతన్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎస్సై చేతికి గాయమై ఏడు కుట్లు పడ్డాయి.

ఇంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎస్సై వివరాలను కేరళ పోలీసులు వెల్లడించారు. ఆయన అలప్పుజ నూరానడ్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌ఛార్జి అరుణ్‌ కుమార్‌ అని స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తన్న అదనపు డీజీ స్వాతి లక్రా ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకుంటూ ఎస్సై ధైర్యసాహసాలను కొనియాడారు. రియల్‌ హీరోలు ఇలాగే ఉంటారని ప్రశంసించారు.

ఇదీ చదవండి: పిడుగుపాటుకు నలుగురు బలి... భీకర వరదలకు 9 మంది...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.