ETV Bharat / bharat

మహాత్మా గాంధీపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు- శివసేన ఫైర్​

author img

By

Published : Nov 17, 2021, 12:05 PM IST

వరుస వివాదాలకు తెరతీస్తున్న బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ (Kangana ranaut news​).. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ (Kangana ranaut gandhi) సహా మరికొంతమంది నేతాజీని అణచివేతదారులకు అప్పగించేందుకు అంగీకరించారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గాంధీ ప్రవచించిన అహింస సూత్రాన్ని ఎద్దేవా చేశారు కంగన. అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Kangana sparks fresh row,
కంగన వివాదాస్పద వ్యాఖ్యలు

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana ranaut news​) మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌లకు అప్పట్లో గాంధీ(Kangana ranaut gandhi) నుంచి మద్దతు లభించలేదని పేర్కొన్నారు. ''ఒక చెంప మీద కొడితే రెండోది చూపించాలి'' అంటూ మహాత్మాగాంధీ ప్రవచించిన అహింస సూత్రాన్ని ఆమె ఎద్దేవా చేశారు. ''అలా చేస్తే దక్కేది స్వాతంత్య్రం కాదు.. అది 'భిక్షే' అవుతుంది'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

''భారత్‌కు అసలైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చింది. 1947లో వచ్చింది కేవలం భిక్షే..'' అంటూ కొద్ది రోజుల క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే ఆమె ట్విట్టర్‌ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయగా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మళ్లీ అదే తరహా పోస్టులు పెట్టారు. 'నేతాజీని అప్పగించేందుకు గాంధీ (Kangana ranaut gandhi) తదితరులు అప్పట్లో అంగీకరించారు' అనే శీర్షికతో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ఆమె జత చేశారు.

Kangana sparks fresh row
గాంధీపై కంగన షేర్​ చేసిన పోస్ట్​

''మీరు గాంధీ అభిమానిగానూ, నేతాజీ మద్దతుదారుగానూ ఉండలేరు. ఎవరో ఒకరినే ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ హీరోలను తెలివిగా ఎంచుకోండి'' అని రనౌత్‌ పేర్కొన్నారు. మరో పోస్టులో - ''స్వాతంత్య్రం కోసం పోరాడే వారిని అణచివేతదారులకు అప్పగించేశారు. ఇలా అప్పగించినవారికి అధికార దాహం, కుయుక్తులే తప్ప ధైర్య సాహసాలు లేవు.'' అని కంగన (Kangana ranaut news​) వ్యాఖ్యలు చేశారు. ''ప్రజలు తమ చరిత్ర గురించి, హీరోల గురించి తెలుసుకోవాల్సిన సమయమిది.'' అని పోస్టుల్లో పేర్కొన్నారు.

Kangana sparks fresh row
కంగన ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ

శివసేన విమర్శ..

స్వాతంత్య్రంపై కంగన చేసిన వ్యాఖ్యలను ఆమె పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శించిన శివసేన. నవంబర్​ 17న.. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే 9వ స్మారక దినం సందర్భంగా సామ్నా పత్రికలో వ్యాసం ప్రచురితమైంది. ఇందులోనే కంగనపై పరోక్షంగా విమర్శలు చేసింది శివసేన. ఆమె (Kangana ranaut news​) గంజాయి తాగుతూ ఆ వ్యాఖ్యలు చేసిందని ఆరోపించింది. ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ​ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో పేర్కొంది శివసేన. ​

ఇవీ చూడండి: కంగన వ్యాఖ్యలపై దుమారం- చర్యలకు విపక్షాల డిమాండ్​

'నా వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే.. పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.