ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రవాది హతం- జవాను వీరమరణం

author img

By

Published : Aug 19, 2021, 2:55 PM IST

Updated : Aug 19, 2021, 3:18 PM IST

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని హతమార్చాయి భద్రతా బలగాలు. ఈ క్రమంలోనే ఓ జవాను అమరుడయ్యారు.

జమ్ముకశ్మీర్​
Jammu and Kashmir

జమ్ముకశ్మీర్​ రజౌరీలో గురువారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ముష్కరుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్​కు చెందిన జూనియర్ కమిషన్డ్​ అధికారి (జేసీఓ) వీరమరణం పొందారు. మరో జవాను గాయాలపాలయ్యారు.

ఉగ్రవాదుల కదలికల సమాచారంపై కార్యోటె కలాస్ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. దీంతో పరిస్థితి ఎన్​కౌంటర్​కు దారితీసింది. అయితే గాయపడిన జేసీఓను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

Last Updated :Aug 19, 2021, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.