భారీ ఎన్​కౌంటర్​.. ఐదుగురు నక్సల్స్ హతం.. మృతుల్లో టాప్ కమాండర్!

author img

By

Published : Apr 3, 2023, 12:18 PM IST

Updated : Apr 3, 2023, 1:44 PM IST

Jharkhand Maoist encounter

ఝార్ఖండ్​లో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు నక్సలైట్లు మరణించారు. ఘటనాస్థలిలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఎన్​కౌంటర్​లో మరణించిన ఇద్దరిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

ఝార్ఖండ్​లో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారు. పలాము-ఛత్రా సరిహద్దులో పోలీసులు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నక్సలైట్ గౌతం పాసవాన్​ సహా ఐదుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అనేక మంది నక్సల్స్​కు బుల్లెట్​ గాయాలయ్యాయని పేర్కొన్నారు.

మృతి చెందిన నక్సల్స్​లో గౌతమ్ పాసవాన్​, చార్లీపై రూ.25లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. నందు, అమర్​ గంజు, సంజీవ్ భుయాన్​పై రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

పలాము- ఛత్రాలో సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్ మృతి చెందారు. అనేక మంది నక్సల్స్ గాయపడ్డారు. మృతుల్సో ఇద్దరిపై చెరో రూ. 25 లక్షలు, ఇంకో ఇద్దరిపై చెరో రూ.5 లక్షల రివార్డులు ఉంది. ఘటనాస్థలిలో ఏకే 47, భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాం. సోమవారం ఉదయం 8.30 గంటలకు నక్సల్స్​పై కాల్పులు జరిపాం.

--పోలీసులు

మరోవైపు.. ఆదివారం ఉదయం ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​లో ముగ్గురు నక్సల్స్​ను పోలీసులు, డీఆర్​జీ(జిల్లా రిజర్వ్ గార్డ్స్) బృందం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేశాయి. అరెస్టైన వారిని సముంద్‌ అలియాస్‌ సుమన్‌సింగ్‌ అంచాల (42), సంజయ్‌ కుమార్‌ ఉసెండి (27), పరశ్రమ్‌ దంగూల్‌ (55)గా పోలీసులు గుర్తించారు.

'నక్సల్స్ ఉనికి గురించి కచ్చితమైన సమాచారం జాయింట్​ ఆపరేషన్ నిర్వహించాం. కోయెలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవి నుండి ముగ్గురు నక్సల్స్​ను అరెస్ట్ చేశాం. అరెస్టయిన నక్సల్స్‌ నిర్మాణ పనుల్లో ఉన్న వాహనాలను తగలబెట్టడం, టవర్‌లకు నిప్పంటించడం, పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ముద్రవేసి అమాయకులపై దాడి చేయడం వంటి ఘటనల్లో నిందితులుగా ఉన్నారు.'

--పోలీసులు

గతేడాది.. ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. జగర్​గుండా అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వు పోలీసులు, సీఆర్​పీఎఫ్​ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

భాజపా నేత హత్య..
2023 ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్​ జిల్లాలో భాజపా నేతను నక్సలైట్లు అత్యంత పాశవికంగా హత్య చేశారు. జిల్లాలోని ఉసూరు మండల భాజపా అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను.. కుటుంబ సభ్యుల ముందే గొడ్డలి, కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు. నీలకంఠ కక్కెం తన స్వగ్రామమైన ఆవపల్లిలో మరదలి వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున సమయంలో నక్సలైట్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన స్థలంలో నక్సలైట్లు తామే ఈ హత్య చేసినట్లుగా కరపత్రాల్లో రాసి విడిచి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.

Last Updated :Apr 3, 2023, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.