ETV Bharat / bharat

జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. 18 మందికి టాప్ ర్యాంక్!

author img

By

Published : Sep 15, 2021, 2:25 AM IST

జేఈఈ మెయిన్స్​-2021 ఫలితాలను(JEE MAINS RESULTS) జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) బుధవారం విడుదల చేసింది. మొత్తం 44 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించగా.. 18 మంది మొదటి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో ఏపీ, తెలంగాణ విద్యార్థుల హవా కొనసాగింది. ఏపీ నుంచి నలుగురు మొదటి ర్యాంక్‌ సాధించగా.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

JEE mains
JEE mains

జేఈఈ మెయిన్స్ నాలుగో విడత​ ఫలితాలను(JEE MAINS RESULTS) విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్​టీఏ). ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 44మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో 18 మంది అభ్యర్థులు టాప్ ర్యాంకును సాధించారు. మొత్తం 9,34,602 మంది అభ్యర్థులు అర్హత సాధించిన ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులూ సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి దుగ్గినేని వెంకటపనీష్‌, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్‌ నాయుడు, కర్నం లోకేశ్‌లు మొదటి ర్యాంక్‌ కైవసం చేసుకోగా.. తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్యకు తొలిస్థానం దక్కింది.

వీరితోపాటు.. రాజస్థాన్ నుంచి సిద్ధాంత్ ముఖర్జీ, అన్షుల్ వర్మ, మృదుల్ అగర్వాల్, దిల్లీ నుంచి రుచిర్ బన్సాల్, కావ్య చోప్రా, ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అమయ్య సింఘాల్, పాల్ ఉన్నారు అగర్వాల్, పంజాబ్​ నుంచి పుల్కిత్ గోయల్, చండీగఢ్ గురమృత్ సింగ్, గౌరబ్ దాస్ (కర్ణాటక), వైభవ్ విశాల్ (బీహార్)​లు తొలిస్థానం సాధించారు.

విద్యార్ధుల స్కోర్‌లను మెరుగుపరిచి, వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు జేఈఈని సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహిస్తోంది కేంద్రం. మొదటి దశ ఫిబ్రవరిలో, రెండోది మార్చిలో, మూడవ ఎడిషన్ జూలై 20-25 వరకు.. నాలుగో ఎడిషన్ ఆగస్టు 26-సెప్టెంబర్ 2 మధ్య నిర్వహించారు.

ఐఐటీల్లో బీఈ, బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్​టీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. మొత్తం 13 భారతీయ భాషల్లో ఈ పరీక్ష జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.