ETV Bharat / bharat

జేడీయూకు షాక్- భాజపాలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు

author img

By

Published : Dec 25, 2020, 4:49 PM IST

JD(U) suffers setback in Arunachal, six MLAs join BJP
నితిశ్​కుమార్ నేతృత్వంలోని జేడియూకి భారీ షాక్​

అరుణాచల్​ ప్రదేశ్​లో జేడీయూకు గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు భాజపాలో చేరారు.

జేడీయూకు భారీ షాక్ తగిలింది. అరుణాచల్ ​ప్రదేశ్​లో ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు భాజపాలో చేరారు. అరుణాచల్​ పీపుల్స్​ పార్టీ(పీపీఏ)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే కూడా అదే బాట పట్టారు.

ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒక్కరోజు ముందు ఈ పరిణామం జరగడం గమనార్హం.

ముందే సంకేతాలు

అరుణాచల్​ ప్రదేశ్​ జేడీయూలో తిరుగుబాటు కొద్ది రోజుల క్రితమే మొదలైంది. పార్టీ సీనియర్ నేతలకు చెప్పకుండా ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి తాలేమ్ తబోను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆగ్రహించిన అధిష్ఠానం... ముగ్గురికి నవంబర్ 26నే షోకాజ్ నోటీసులు ఇచ్చి, సస్పెండ్ చేసింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పీపీఈ ఎమ్మెల్యేనూ ఆ పార్టీ అధిష్ఠానం ఇటీవలే సస్పెండ్​ చేసింది.

భాజపా మరింత బలోపేతం

2019 లో అరుణాచల్​ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 60 స్థానాల్లో భాజపా 41 దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడియూ 15 స్థానాల్లో పోటీ చేసి 7 స్థానాల్ని కైవసం చేసుకుని భాజపా తరువాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్​పీపీ)కి చెరో నలుగురు శాసన సభ్యులున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో భాజపా బలం 48కి పెరిగింది.

ఇదీ చూడండి: 'ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే తెరాసను వీడుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.