ETV Bharat / bharat

జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. రాకేశ్ రెడ్డికి 9న శిక్ష ఖరారు

author img

By

Published : Mar 6, 2023, 5:29 PM IST

Updated : Mar 6, 2023, 9:20 PM IST

Jayaram murder
Jayaram murder

Chigurupati Jayaram murder case updates: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి.. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేశ్‌ రెడ్డిని దోషిగా తేల్చుతూ.. మార్చి 9వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఇదే కేసులో.. ఏసీపీ మల్లారెడ్డి, ఇద్దరు సీఐలతో పాటు మొత్తం 11 మందిని నిర్దోషులుగా తేల్చింది.

Chigurupati Jayaram murder case updates: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి.. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేశ్‌ రెడ్డిని దోషిగా తేల్చుతూ, మార్చి 9వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఇదే కేసులో ఏసీపీ మల్లారెడ్డి, ఇద్దరు సీఐలతో పాటు మొత్తం 11 మందిని నిర్దోషులుగా తేల్చింది.

అప్పట్లో కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా.. ''2019 జనవరి 31న పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాంను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. దోషులు యత్నించారు. ఆ తర్వాత జయరాం మృతదేహాన్ని.. తన స్నేహితులతో కలిసి రాకేశ్‌ రెడ్డి.. కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారులో ఉంచారు. డబ్బు వ్యవహారమే జయరాం హత్యకు ముఖ్య కారణం'' అని పోలీసులు విచారణ చేపట్టి.. 2019 మే నెలలోనే నేరాభియోగపత్రం దాఖలు చేశారు. ఈ అభియోగాలపై దాదాపు నాలుగేళ్లపాటు విచారణ జరిపిన కోర్టు.. నేడు రాకేశ్‌ రెడ్డిని దోషిగా తేల్చింది. మిగతా వారి ప్రమేయంపై తగిన ఆధారాలు లేనందున 11 మందిని నిర్దోషులుగా నిర్ణయిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

అసలు ఏం జరిగిందంటే: పారిశ్రామికవేత్త జయరాం 2019వ సంవత్సరం జనవరి 31వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. రాకేష్ రెడ్డి, తన స్నేహితులతో కలిసి ఆయనను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి.. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై ఒక వాహనంలో వదిలేసి వెళ్లారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టుకు పంపించారు. దీంతో జయరాం హత్య కేసు నాలుగేళ్లుగా విచారణ సాగుతూనే ఉంది.

అప్పట్లో ఈ కేసు దర్యాప్తును చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు రాకేష్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన వాళ్లను కూడా అరెస్ట్ చేశారు. దర్యాప్తు పూర్తైన తర్వాత నాంపల్లి కోర్టులో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. 388 పేజీల నేరాభియోగపత్రంలో 45 మందిని సాక్షులుగా చేర్చారు. అయితే, వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన బేదాభిప్రాయాల కారణంగానే జయరాంను రాకేష్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు నేరాభియోగపత్రంలో పేర్కొన్నారు.

ఈ కేసుకు సంబంధించి అప్పట్లో మొత్తం 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఆ 12 మందిలో ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దాదాపు నాలుగేళ్ల పాటు విచారించిన నాంపల్లి కోర్టు.. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని మాత్రమే దోషిగా తేల్చి, మిగతా 11మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న విశాల్​ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనిపై వేరే కేసులు లేకపోతే వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. దోషిగా తేలిన రాకేష్ రెడ్డిని నాంపల్లి కోర్టు నుంచి తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇవీ చదవండి

Last Updated :Mar 6, 2023, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.