ETV Bharat / bharat

అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్​ ప్లాన్​.. కుటుంబంతో సహా ప్రమాదంలో మరణించినట్టు కట్టుకథ

author img

By

Published : Jan 8, 2023, 10:12 PM IST

బ్యాంకులు నుంచి తీసుకున్న అప్పులను ఎగ్గొట్టేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. రోడ్డు ప్రమాదంలో కుటుంబంతో సహా తాను మరణించినట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

fake road accident jammu kashmir
fake road accident jammu kashmir

బ్యాంకులు నుంచి తీసుకున్న అప్పులను ఎగ్గొట్టేందుకు ఓ వ్యక్తి సినిమా తరహాలో ప్లాన్ చేశాడు. కుటుంబంతో సహా తాను రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడో జమ్ముకశ్మీర్​కు చెందిన వ్యక్తి. ఇంతకీ ఏం జరిగిందంటే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దోడ జిల్లాకు చెందిన మంజీత్ సింగ్ అనే వ్యక్తి వ్యాపారాన్ని పెట్టేందుకు బ్యాంకులు, కొందరు వ్యక్తుల నుంచి రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఈ డబ్బులను తిరిగి కట్టకుండా ఉండేందుకు ఒక ప్లాన్ చేశాడు. భదర్వా నుంచి జమ్ముకు వెళ్లేటప్పుడు కారు అదుపు తప్పి చీనాబ్​ నదిలో పడిపోయింది. గతేడాది డిసెంబరు 20న జరిగిందీ ఘటన. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారికి అక్కడ మంజీత్.. గుర్తింపు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్​, ఈ-శ్రామ్ కార్డు లభించింది. కారును చీనాబ్​ నది నుంచి బయటకు తీశారు. పోలీసులు, ఎస్​డీఆర్ఎఫ్​ బృందాలు కొన్ని రోజుల పాటు వెతికినా మంజీత్ సింగ్ కుటుంబం ఆచూకీ కనిపించలేదు. ఈ క్రమంలో పోలీసులు మంజీత్ సింగ్ ఆర్థిక పరిస్థితిని పరిశీలించారు. ఈ క్రమంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి మంజీత్​సింగ్​ కోసం గాలించారు. అప్పడే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

"మంజీత్​ సింగ్ వ్యాపారం పెట్టడం కోసం బ్యాంకులు, వేర్వేరు వ్యక్తుల వద్ద నుంచి రూ. 30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ రుణాలను ఎగ్గొట్టేందుకు రోడ్డు ప్రమాదంలో తన కుటుంబంతో సహా తాను మరణించినట్లు అందరినీ నమ్మించేందుకు ప్లాన్ చేశాడు. పోలీసు బృందాలు గాలించి మనీందర్ కుటుంబాన్ని హరియాణాలోని పంచకులలో పట్టుకున్నాం. అతడిపై కేసు నమోదు చేశాం.

--పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.