ETV Bharat / bharat

జేమ్స్​ X కశ్మీర్​ ఫైల్స్​.. కర్ణాటకలో సినిమా రాజకీయం!

author img

By

Published : Mar 23, 2022, 8:56 PM IST

d
d

James vs Kashmir Files: కశ్మీర్​ ఫైల్స్​ సినిమా కోసం 'జేమ్స్'​ ప్రదర్శనలను తగ్గించాలని భాజపా నేతలు థియేటర్ల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నట్లు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. జేమ్స్​కు థియేటర్లు తగ్గిస్తే దివంగత పునీత్​ రాజ్​కుమార్​ను, ఆయన కుటుంబాన్ని అవమానించినట్లే అని కేపీసీసీ చీఫ్​ డీకే శివకుమార్​ వ్యాఖ్యానించారు.

James vs Kashmir Files: కర్ణాటకలో 'కశ్మీర్​ ఫైల్స్' చిత్రానికి సంబంధించి.. ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్​ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దివంగత నటుడు, కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ చివరి చిత్రమైన 'జేమ్స్' ​ప్రదర్శనలు తగ్గించి 'కశ్మీర్​ ఫైల్స్​' ప్రదర్శించేలా థియేటర్​ యాజమాన్యాలపై భాజపా ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతే స్వయంగా తనతో చెప్పినట్లు పేర్కొన్నారు.

'జేమ్స్​' చిత్రానికి థియేటర్లు తగ్గించడం ద్వారా పునీత్​ రాజ్​కుమార్​ను, ఆయన కుటుంబాన్ని అవమానించినట్లే అని కేపీసీసీ చీఫ్​ డీకే శివకుమార్​ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అత్యున్నత పురస్కారం కర్ణాటక రత్నతో ప్రభుత్వం గౌరవించిన పునీత్​ పట్ల కనీస మర్యాద చూపించాల్సిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. సిద్ధరామయ్య చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అటువంటివి ఏమీ జరగలేదని తెలిపారు.

"కశ్మీర్ ఫైల్స్​ చరిత్రకు సంబంధించినది. రెండు సినిమాలను పోల్చి చూడటంలో అర్థం లేదు. ఇలాంటి వివాదాలు సృష్టించడంలో సిద్ధరామయ్య చాలా తెలివైన వ్యక్తి. జేమ్స్​ సినిమా రాష్ట్రవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధిస్తోంది. అదే సమయంలో పలు ప్రాంతాల ప్రజలు కశ్మీర్​ ఫైల్స్​ను కనీసం ఒక్క షో అయినా థియేటర్లలో ప్రదర్శించమని డిమాండ్​ చేస్తున్నారు. అందుకే కొన్ని థియేటర్లలో ఉదయం 8 గంటలకు ఈ సినిమా స్క్రీనింగ్​ చేయాలని నేను థియేటర్​ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశాను."

-సీటీ రవి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

'కశ్మీర్​ ఫైల్స్'​పై కామెంట్​ చేశాడని : రాజస్థాన్​లోని అల్వార్​ జిల్లా గోకుల్​పుర్​ గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. 'కశ్మీర్​ ఫైల్స్'​ చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శించాడని ఓ దళిత యువకుడిని బలవంతంగా ఆలయం ముందుకు తీసుకెళ్లి అతని ముక్కును నేలకు రాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చూడండి : అర్ధరాత్రి పరుగుతో సంచలనం- సాయం చేస్తామని ఎందరో ముందుకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.